మళ్ళీ పార్టీ మారిన జయప్రద

సినీ నటి జయప్రద మళ్ళీ పార్టీ మారారు. మొదట తెలుగుదేశంలో ఉన్న జయప్రద ఆ తరువాత సమాజ్ వాది పార్టీలోకి దూకారు. సమాజ్ వాది పార్టీ ఎంపీగా ఉత్తరప్రదేశ్ నుంచి ఎలక్టయిన జయప్రద సమాజ్ వాదిని వదిలేశారు. తాజాగా రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలో చేరారు. అజిత్ సింగ్ నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీకి ఉత్తర్ ప్రదేశ్ లో కొంత పట్టుంది. కనీసం ఐదారు సీట్లు గెలుస్తుందని అంచనా. జయప్రదతో పాటు అమర్ సింగ్ కూడా ఆ పార్టీలో చేరారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని, అందులో ఒక ప్రాంతాన్ని హరిత ప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని అజిత్ సింగ్ పార్టీ కోరుతోంది. ఈ డిమాండ్ ను సపోర్ట్ చేస్తామని జయప్రద, అమర్ సింగ్ ప్రకటించారు. వీళ్ళిద్దరికీ కూడా టిక్కెట్లు ఇచ్చి ఎంపీలుగా నిలబెడతామని అజిత్ సింగ్ చెప్పారు. జయప్రద కాంగ్రెస్ లో చేరుతుందని ఈమధ్య వార్తలొచ్చాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy