మసీదులో హెల్త్ సెంటర్..

పొట్ట చేతపట్టుకుని పట్నానికి వచ్చేవాళ్లు ఎక్కువగా మురికివాడల్లో ఉంటుంటారు. రోజూవారీ జీవనానికే కష్టంగా ఉండే వీళ్లకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే …మామూలు వైద్యం చేయించుకోవడమే కష్టమైన వీళ్లకు, నాణ్యమైన వైద్యం అందడమనేది ప్రశ్నార్ధకమే. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం అందుతుంది.కానీ దాని గురించి వాళ్లలో ఎక్కువమందికి అవగాహన ఉండడం లేదు. అలాంటి వాళ్లకు బాసటగా నిలుస్తోంది పాతబస్తీలోని ‘మస్జీద్–ఇజ్‌‌– హక్‌‌. మసీదునే హెల్త్ సెంటర్‌‌గా మార్చి అన్ని మతాల వారికి ఉచితంగా వైద్యం అందిస్తోంది. దేశంలోనే ఈ తరహా సర్వీసు ఇదే మొదటిది కావడం విశేషం.

సేవ చేయడానికి మతం అడ్డుకాదు. పేదలకు మంచి వైద్యం అందించాలన్న ఉద్దేశంతో హెల్త్‌‌‌‌ సెంటర్‌‌‌‌ను ఏర్పాటు చేసింది మస్జీద్‌– ఇజ్‌–హక్‌. హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ ఎన్వోజీ సాయంతో దీనిని నెలకొల్పారు. మొత్తం 30 ప్రభుత్వాసుపత్రులతో ఈ హెల్త్‌ ‌‌‌సెంటర్‌‌‌ కనెక్ట్ అయ్యి ఉంది. లక్షా యాభై వేల మందికి ఉచితంగా వైద్యం అందించటం ఈ ప్రైమరీ హెల్త్‌‌‌‌ కేర్‌‌‌‌ సెంటర్‌‌‌‌ లక్ష్యం. ప్రస్తుతం రోజుకి నలభై నుంచి యాభై మంది ఈ హెల్త్‌ ‌‌‌సెంటర్‌‌‌‌కు వస్తున్నారు.

ఫ్రీ సర్వీసులు

నవాబ్‌ సాహెబ్‌కుంట అచ్చిరెడ్డి నగర్‌‌‌‌లో రెండేళ్ల క్రితం ఏర్పాటయ్యింది ఈ మసీదు. మొత్తం మూడు అంతస్థుల భవనం. గ్రౌండ్‌ ఫ్లోర్‌‌‌‌ లో ఈ క్లినిక్‌ ను ఈ మధ్యే ప్రారంభించారు. ఫిజియోథెరపీ, ఫస్ట్‌ ఎయిడ్‌, గర్భవతులకు చికిత్స, పిల్ల లకు వ్యాక్సినేషన్ సేవల్ని అందిస్తున్నారు. మందుల్ని కూడా ఫ్రీ గానే ఇస్తారు. డయాబెటిస్‌, హైపర్‌‌‌‌ టెన్షన్‌, క్యాన్సర్‌‌‌‌, కిడ్నీ వ్యాధులు, డెంగ్యూ.. క్షయ లాంటి ఇన్‌ఫెక్షన్‌ వ్యాధులకూ చికిత్స అందించటం ప్రారంభించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల దాకా తెరిచి ఉంటుంది. శుక్ర, ఆదివారాల్లో సెలవు. ప్రస్తుతానికి ఒక డాక్టర్, నర్సు ఇక్కడ సేవలు అందిస్తున్నారు. రెండు వాహనాల్లో ఉచిత రవాణా సదుపాయం కల్పించారు. కొందరు ఆటోవాలాలు కూడా స్వచ్ఛందంగా సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. పేషెంట్‌‌‌‌ వ్యాధి తీవ్రతను బట్టి పెద్దాసుపత్రులకు రిఫర్‌‌‌‌ చేస్తారు. తీగలకుంట, జహనుమా, తాడ్‌బండ్‌, ఫాతిమా నగర్‌‌‌‌, వటపల్లి, ఛాస్మా, ముస్తఫానగర్‌‌‌‌, పహడీగుంతల్‌ షా బాబా, ప్రాంత వాసులు ఈ ఉచిత సేవల్ని ఉపయోగించు కుంటున్నారు.

 ఆ ప్రస్తావనలేదు

ప్రపంచంలో మసీదుల్లో హెల్త్‌‌‌‌ కేర్‌‌‌‌ సెంటర్ లను ఏర్పాటు చేయటం కొత్తేం కాదు. టెక్సాస్‌, మలేషియా, మరికొన్ని సౌదీ దేశాల్లో ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయి. అయితే మన దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయటం మాత్రం ఇదే తొలిసారి. ‘ఇక్కడ కుల మతాల ప్రస్తావన లేదు. అన్ని మతాల వారికి వైద్య సహాయం అందుతుంద’ని హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ ట్రస్టీ ముజ్‌‌‌‌తాబ్‌ అస్కారీ తెలిపారు. తొమ్మిది మురికివాడలకు కేంద్రంగా ఉన్న ఈ హెల్త్‌‌‌‌ సెంటర్‌ ‌‌‌సేవల్ని త్వరలో మరింత విస్తృతం చేయబోతున్నట్లు ఆయన చెప్పారు. అంతేకాదు మరికొన్ని మసీదుల్లో కూడా ఇలాంటి సౌకర్యాన్ని కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy