మస్ట్ రీడ్ : ఆధార్ లింక్ డెడ్ లైన్స్ ఇవే!

aadhaarఆధార్. అన్నింటికీ లింక్ చేసుకోవాలని ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. మొబైల్ నెంబర్ కు ఆధార్ లింక్ కోసం టెలికాం కంపెనీలు ఫోన్లు చేసి మరీ కోరుతున్నాయి. అదే విధంగా మీ ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ అకౌంట్, ప్రభుత్వ పథకాలు ఇలా ప్రతిదానికీ ఆధార్ నంబర్ ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పటికే ప్రత్యేక కౌంటర్లు, మొబైల్ టీం ఈ పనిలో బిజీగా ఉన్నాయి. అసలు ఆధార్ నంబర్ వేటికి లింక్ చేసుకోవాలి.. వాటి డెడ్ లైన్స్ ఏంటో ఓ సారి చూద్దాం. ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన వార్త ఇది.

పాన్ కార్డ్ :

పాన్ కార్డ్ తో ఆధార్ లింక్ డెడ్ లైన్ డిసెంబర్ 31, 2017. ఈలోపు మీరు అనుసంధానం చేసుకోవాలి. లేనిపక్షంలో రిటర్న్స్ దాఖలు చేయటానికి అవకాశం ఉండదు. ఆగస్ట్ 31వ తేదీతో ముగిసిన ఈ గడువును డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించారు. సో.. టైం ఉంది కాబటి టెన్షన్ లేకుండా ముందుగానే లింక్ చేసుకోండి.

మొబైల్ సిమ్ నంబర్ కు ఆధార్ :

ఫోన్ లేని ప్రపంచాన్ని ఊహించలేం. ప్రతి ఇంట్లో రెండు, మూడు ఫోన్లు మోగుతున్నాయి. అయితే 2018 ఫిబ్రవరి తర్వాత ఆధార్ తో మీ ఫోన్ నంబర్ ను లింక్ చేసుకోవాలి. లేకపోతే మూగబోతాయి. అవును.. ఫిబ్రవరి 28, 2018 డెడ్ లైన్ పెట్టింది కేంద్రం. దేశంలో ఇప్పటికే 100 కోట్లు దాటాయి మొబైల్ నంబర్. దీంతో గడువు కూడా ఎక్కువగానే ఇచ్చింది. వేచిచూసే ధోరణి లేకుండా మీకు టైం ఉన్నప్పుడు ఈ పనిని కంప్లీట్ చేసుకోవాలని కూడా చెబుతోంది ప్రభుత్వం.

బ్యాంక్ అకౌంట్ – మ్యూచువల్ ఫండ్స్ :

బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆధార్ నంబర్ తో లింక్ చేసుకోవాలి. లేకపోతే డిసెంబర్ 31, 2017 తర్వాత మీ ఖాతాను సీజ్ చేస్తారు. ఆ తర్వాత అసలు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయటానికి కూడా కష్టం అవుతుంది. ఇప్పటికే ఈ డెడ్ లైన్ పలుమార్లు పొడిగించారు. ఈసారి వెసలుబాటు ఉండదని ప్రభుత్వం చెబుతోంది. సో.. డిసెంబర్ 31వ తేదీలోపు మీ బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ ను లింక్ చేసుకోండి.

అదే విధంగా మీ పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్స్ రూపంలో వాటికి కూడా విధిగా ఆధార్ తో అప్ డేట్ చేసుకోవాలి. లేకపోతే వాటిని నగదుగా మార్చుకోవటం కుదరదు.

ప్రభుత్వ పథకాలకు ఆధార్ :

ఇది చాలా కీలకమైనది. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందే వారు విధిగా ఆధార్ నంబర్ సమర్పించాలి. అంటే రేషన్, పెన్షన్, స్కాలర్ షిప్స్ ఇతర పథకాల ద్వారా లబ్దిపొందే వారు డిసెంబర్ 31వ తేదీలోపు విధిగా లింక్ చేసుకోవాలి. సెప్టెంబర్ 30వ తేదీ గడువును.. ప్రభుత్వం మూడు నెలలు పొడిగించింది. ఈ 90 రోజుల్లో అయినా ఈ పని పూర్తి చేసుకోవాలి. లేదంటే జనవరి ఒకటి నుంచి రేషన్, పెన్షన్ కట్.

మీ ఆధార్ ఎంత ముఖ్యమైనదో అర్థం అయ్యింది కదా.. ఇప్పటికే చాలాసార్లు గడువు పెంచుతూ వచ్చిన ప్రభుత్వం.. ఈసారి అలాంటి ఆలోచన లేదని సంకేతాలు ఇచ్చింది. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదుకాబట్టి.. టైం ఉన్నప్పుడూ ముందుగా ఈ పనులు పూర్తి చేసుకుంటే బెటర్..

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy