మస్ట్ రీడ్: ఈ పనులు వెంటనే చేయండి: జూలై ఒకటి GSTనే కాదు.. ఆధార్ డే

gstజూలై ఒకటో తేదీ. భారతదేశం మారిపోతుంది. సరికొత్తగా ఆవిష్కరణ జరగబోతోంది. అదే GST. ఒకే జాతి – ఒకే పన్ను – ఒకే మార్కెట్ నినాదంతో మొత్తం వ్యవస్థ మారుతుంది. చరిత్ర పుస్తకాల్లో జూలై ఒకటి చారిత్రాత్మకంగా నిలిచిపోతుంది. ఒక్క GSTనే కాదు.. ఆధార్ డే కూడా అంటున్నారు ఆర్థిక నిపుణులు. వినటానికి వింతగా ఉన్నా.. ఇది పచ్చి నిజం. పన్నుల విధానమే కాకుండా.. ఇతర అతిపెద్ద మార్పులు ఏంటో తెలుసుకుందాం.. పాటిద్దాం. ఇప్పటికీ చేయకపోతే ఇప్పుడే పని మొదలుపెడదాం.. ఫాస్ట్.. ఫాస్ట్..

… ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయటానికి ఆధార్ తప్పనిసరి. ఆధార్ నంబర్ లేకుండా మీరు ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయలేరు.

… పాన్ కార్డుతో ఆధార్ జత చేయటం విధి. ఇది నిర్బంధం. పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయకపోతే ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 139AA కింద PAN చెల్లుబాటు కాదు.

… కొత్త పాన్ కార్డ్ పొందాలన్నా ఆధార్ తప్పనిసరి. మీ ఆధార్ కార్డు లేకుండా శనివారం (జూలై 1) నుంచి పాన్ కార్డు పొందలేరు.

… ఆధార్ కార్డ్ లేకుండా పాస్ పోర్ట్ పొందలేరు. దరఖాస్తుల్లో విధిగా ఆధార్ కార్డు జత చేసింది.

… PF ఖాతాకు ఆధార్ తప్పనిసరి. జూన్ 30వ తేదీ నాటికి పీఎఫ్ ఖాతాతో ఆధార్ అనుసంధానం చేయాలని కేంద్రం నిర్ణయించింది. పెన్షనర్లు కూడా వారి వివరాలు సమర్పించాలి. EPFO ప్రకారం ఆధార్ లింక్ ద్వారానే సెటిల్ మెంట్ ప్రాసెస్ సమయం తగ్గిపోతుందని స్పష్టం చేసింది.

… రైల్వే టికెట్లపై వివిధ వర్గాలకు లభించే రాయితీ పొందాలంటే ఆధార్ తప్పనిసరి చేసింది రైల్వే శాఖ. మీ నంబర్ లేకుంటే రాయితీ కట్.

… స్కూల్స్, కాలేజీల్లోని పిల్లలు, స్టూడెంట్స్ స్కాలర్ షిప్ పొందాలంటే ఆధార్ మస్ట్ చేసింది కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ. జూన్ 30నాటికి ఆధార్ వివరాలు సమర్పించాల్సింది ఉంది. లేకపోతే వెంటనే ఆపని చేసేయండి. లేదంటే మీకు ఉపకార వేతనం అందదు.

… ప్రతినెలా రేషన్ షాపుల నుంచి సరుకు తీసుకునేవారు వెంటనే ఆధార్ నంబర్ ను మీ ఖాతాతో లింక్ చేసుకోండి. లేకపోతే జూలై నెల రేషన్ తీసుకోలేరు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy