మహబూబ్‌నగర్, నల్లగొండ, భువనగిరి, మెదక్ జిల్లాల్లో ఇవాళ కేసీఆర్ సభలు

హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ మహబూబ్‌నగర్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, మెదక్ జిల్లాల్లో ఇవాళ కేసీఆర్ సభలు ఉన్నాయి. హెలికాప్టర్‌లో ఉదయం 11 గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు కేసీఆర్ చేరుకుంటారు. పట్టణ శివారులో జరిగే బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం జడ్చర్ల నుంచి దేవరకొండకు మధ్యాహ్నం 12 గంటలకు చేరుకొని ముదిగొండరోడ్డులోని మిషన్‌కాంపౌండ్‌లో జరిగే సభలో ప్రసంగిస్తారు. తర్వాత దేవరకొండ నుంచి కేసీఆర్ నకిరేకల్‌కు చేరుకుంటారు.

అక్కడి నుంచి కేసీఆర్ భువనగిరి జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. స్థానిక జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించే సభకు కేసీఆర్ హాజరవుతారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. మంత్రి హరీశ్‌రావు, పద్మాదేవేందర్‌రెడ్డి సభాస్థలిని పరిశీలించి పలు సూచనలు చేశారు. నిజామాబాద్ రేంజ్ డీఐజీ శివశంకర్‌రెడ్డి, మెదక్ ఎస్పీ చందనదీప్తి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy