మహబూబ్ నగర్ జాగీర్ ఎవరికి?

రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ స్థానం సంపాదించుకున్న నాయకులను ఆదరించిన నియోజకవర్గం మహబూబ్ నగర్. నియోజకవర్గ చరిత్రలో నాలుగుసార్లు కాంగ్రెస్, మరో నాలుగుసార్లు టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వరుసగా రెండుసార్లు ఇండిపెండెంట్లు గెలిచారు. తొలిసారిగా బీజేపీ పాలమూరులో జెండా పాతింది. వినూత్న తీర్పు ఈ సెగ్మెంట్ సొంతం. మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానంపై స్పెషల్ స్టోరీ.

 • మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మహబూబ్ నగర్ మున్సిపాలిటీ, మండలంతో పాటు హన్వాడ మండలం ఉంది.
 • మహబూబ్ నగర్ మండలంలో 18 గ్రామాలు, హన్వాడలో 19 గ్రామాలున్నాయి.
 • ఈ సెగ్మెంట్ లో  2 లక్షల 1,886 మంది ఓటర్లున్నారు.
 • ఇవి కాకుండా మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 36 గ్రామాలు, 38 తండాలు ఉన్నాయి.
 • ఇందులో లక్షా 2 వేల 574 మంది పురుష ఓటర్లు,  99 వేల 312 మంది మహిళా ఓటర్లున్నారు.
 • వీళ్లలో 55శాతం మంది బీసీ ఓటర్లు,  20 శాతం ఎస్సీలు , 15 శాతం ఎస్టీలు, ఇతరులు 10 శాతం ఉన్నారు.
 • మొత్తం మూడు లక్షల 4 వేల మంది ఓటర్లున్నారు.

…………………..

 • 1952 లో ఏర్పాటైన ఈ నియోజకవర్గం తొలి ఎన్నికల్లో పల్లెర్ల హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
 • 1983 టీడీపీ ఆవిర్భావం వరకు మహబూబ్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట.
 • 1983లో టీడీపీ అభ్యర్థి పి.చంద్రశేఖర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
 • 1994, 1999 ఎన్నికల్లో మళ్లీ పి.చంద్రశేఖర్ ఘనవిజయం సాధించారు. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్ లో కీలక మంత్రి పదవులను చేపట్టారు.
 • 2004, 2009లో పార్టీలు ప్రకటించిన అభ్యర్థులు కాకుండా ఇండిపెండెంట్లు గెలిచారు.
 • టీడీపీ ఆవిర్భావం తర్వాత ఈ స్థానం ఆ పార్టీకి కంచుకోటగా మారింది.
 • కానీ తెలంగాణ సమస్య పార్టీని  ఇప్పుడు పుట్టిముంచింది.
 • స్పష్టమైన వైఖరి లేకపోవటంతో అభ్యర్థుల్ని ఇబ్బందులకు గురిచేసింది.
 • ఈ తరుణంలో టీఆర్ఎస్, బీజేపీ బలోపేతమయ్యాయి. నియోజకవర్గంలో పాగా వేశాయి.

…………………

 • 2004 ఎన్నికల్లో పులి వీరన్న భార్య పులి అంజమ్మ ఇండిపెండెంట్ గా గెలిచారు.
 • 2009లో రాజేశ్వర్ రెడ్డి ఇండిపెండెంట్ గా గెలిచారు.
 • రాజేశ్వర్ రెడ్డి అకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి యెన్నం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

……………………..

 • రెండేళ్ల పదవీకాలంలో యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నివర్గాలను ఆకట్టుకోవటంతోపాటు ఇటు జేఏసీని పార్టీతో సమన్వయం చేసి ముందుకెళ్లారు.
 • మొత్తానికి బలమైన బీజేపీ తరఫున బలమైన అభ్యర్థిగా నిలిచారు యెన్నం.
 • తొలిసారి ఎమ్మెల్యే పదవి దక్కించుకున్న యెన్నం శ్రీనివాస్ రెడ్డికి ఈసారి టీఆర్ఎస్ నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది.
 • గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సయ్యద్ ఇబ్రహీం పై 1,829 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు యెన్నం.
 • గత ఎన్నికల్లో మూడేళ్లు ఒకరు, రెండేళ్లు మరొకరు ఎమ్మెల్యేగా కొనసాగటంతో ఎవరు ఏం చేశారన్న దానిపై జనంలో అయోమయం నెలకొంది.

……………………..

 • యెన్నం శ్రీనివాసరెడ్డికి ఎదురయ్యే సమస్యల్లో ముఖ్యమైనది మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి తాగునీరు.
 • మున్సిపల్ పరిధిలో మంచినీళ్ళు అందించటంలో పూర్తిస్థాయిలో విఫలమయ్యారు యెన్నం.
 • అలాగే, అప్పన్నపల్లి  రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాలేదు.
 • అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఆల్టర్ నేట్ వాటర్ పైప్ లైన్ సర్వేకే పరిమితమయ్యాయి.
 • అలాగే, గ్రామాలు, తండాల నుంచి జనం ఇతర రాష్ట్ర్రాలకు బతుకుతెరువు కోసం వలస బాట పడుతూనే ఉండడం ఆయనకు నెగిటివ్ గా మారింది.
 • లోకల్ గా విద్యావకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.
 • మెడికల్ కాలేజీ ఏర్పాటు కొలిక్కి రాలేదు.
 • ఎన్నో ఏళ్లుగా ఉన్న తాగునీటి సమస్య పరిష్కారం కాలేదు.
 • రామన్ పాడు  పైప్ లైన్ లు పగుళ్ళు రావటంతో వాటర్ లీకేజీతో రోజుకో ప్రాంతంలో సమస్యలు తలెత్తుతున్నాయి.

యెన్నంకు కలిసొచ్చే అంశాలూ ఉన్నాయి. రెండేళ్ల కాలంలోనే ప్రతి గ్రామంలో పార్టీపరంగా, వ్యక్తిగతంగా సత్సంబంధాలు ఏర్పరుచుకోవడంలో సక్సెస్ అయ్యారు యెన్నం.

 • బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికవటంతో జాతీయ స్థాయిలో చర్చకు అవకాశం ఏర్పడింది.
 • భూత్ పూర్-మహబూబ్ నగర్ 4 లైన్ల రోడ్డుకు శంకుస్థాపన చేశారు.
 • మున్సిపాలిటీలో,  గ్రామాల్లో నీటి ఎద్దడిని పరిష్కరించటానికి నిపుణులతో పరిష్కారం కనుగొనేందుకు సర్వేకు సిద్దమయ్యారు.
 • 359 కోట్లతో ఆల్టర్ నేట్ పైప్ లైన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
 • భూగర్భ డ్రైనేజీతో పాటు గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు మెరుగుపరచటంలోనూ, సోలార్ సిటీగా మహబూబ్ నగర్ ఎంపికవటంలోనూ కీలక పాత్ర పోషించారు.
 • ఇక 2 ఏళ్లలో చెరువులు, కుంటల మరమ్మత్తు చేపట్టి మైనర్ ఇరిగేషన్ ను పునరుద్దరించటం లాంటి పనులు చేశారు.
 • రెండేళ్లలో 20 ఏళ్ల భవిష్యత్తుకు పునాదికి కృషి చేశారన్న ప్రచారంతో ముందుకెళ్తున్నారు.
 • కేంద్ర ప్రభుత్వంలో కస్టమ్స్ అధికారిగా పనిచేసిన యెన్నం రాజకీయాల్లోకి వచ్చారు.

యెన్నంకు మరికొన్ని వింత సమస్యలూ ఉన్నాయి. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నా మైనార్టీ ఓటర్లు ఆయనకు వ్యతిరేకంగా ఉండటం ప్రతికూలాంశం. ఇక తన వ్యాపారాలపైనే దృష్టి సారిస్తున్నారన్న విమర్శతోపాటు,  స్థానికేతరుడనే ముద్ర, సమస్యల పరిష్కారానికి తొందరగా రియాక్ట్ కారన్న అపవాదూ ఉన్నాయి. ప్రజాప్రతినిధిగా కాకుండా ఓ ఉద్యోగిగా జనంలోకి వెళ్తురన్నారన్న విమర్శ నియోజకవర్గంలో అసంతృప్తిని రాజేస్తోంది.
…………………………..

స్థానిక పరిస్థితులతోపాటు ఈ సారి ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా మారే అవకాశం ఉంది. తెలంగాణ ఏర్పాటు క్రెడిట్ తమదే అని కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ దేనికదే ప్రచారం చేసుకోబోతున్నాయి.

 • టీజేఏసీ కో ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు.
 • మైనార్టీ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉంటోంది.
 • కాంగ్రెస్ తరపున డీసీసీ అధ్యక్షుడు  ఒబేదుల్లా కొత్వాల్ రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం.
 • మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటినుంచి బీసీ ఓటర్ల ప్రభావం ఎక్కువ.
 • 55 శాతం పైగా ఉన్న ఈ ఓటర్లే అభ్యర్థుల  గెలుపోటములను నిర్దేశిస్తున్నారు.
 • మైనార్టీ ఓటర్లు 20 శాతం వరకూ ఉన్నారు.
 • బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి పులివీరన్న, పి.చంద్రశేఖర్ లాంటి బీసీ నేతలు పలుమార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
 • మాజీ ఎమ్మెల్యే, మంత్రి పీ. చంద్రశేఖర్ టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరడం గులాబీ దండులో ఉత్సాహం నింపుతోంది.
 • తెలంగాణ క్రెడిట్ తో  పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్యే ముక్కోణపు పోటీ ఖాయమన్నది విశ్లేషకుల మాట.

 

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy