మహబూబ్ నగర్ లో రోడ్డు యాక్సిడెంట్

 రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు…లాఠీ చార్జీ చేసిన పోలీసులు

MBNR-ACCIDENT మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం జానంపేట గ్రామంలో నిన్న సాయంత్రం జరిగిన రోడ్ యాక్సిడెంట్ తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. నేషనల్ హైవే 44పై వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో.. భూత్పూరు మండలానికి చెందిన మహిళ జమ్ములమ్మ  చనిపోయింది. చుట్టుపుచూపుగా జానంపేట గ్రామానికి వచ్చి తిరిగివెళుతున్న సమయంలో… లారీ కింద పడి ఆమె చనిపోవడంతో.. స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రోజూ ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉందంటూ… గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. జనం 4 గంటలకు పైగా చేసిన నిరసన కారణంగా.. హైవేపై 10 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది.  విషయం తెలుసుకున్న పోలీసులు… గ్రామస్తులకు నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. వారు వినకపోవడంతో… బలవంతంగా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. లాఠీఛార్జ్ కు నిరసనగా.. గ్రామస్తులు ఎదురుదాడికి దిగారు. రాళ్లు రువ్వారు. కొందరు పోలీస్ వాహనం అద్దాలు పగలకొట్టారు. అరగంట పాటు.. హైవేపై ఉరుకులు.. పరుగులు.. అరుపులు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

MBNR-ACCIDENT2రాళ్లదాడిలో వనపర్తి డీఎస్పీ చెన్నయ్య తలకు తీవ్ర గాయమైంది. వెంటనే పోలీసులు ఆయన్ను హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు.మహిళ మృతిపై బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తగ్గేది లేదని గ్రామస్తులు హైవేపై బైఠాయించారు. యాక్సిడెంట్లు జరగకుండా.. ఫ్లై ఓవర్ గానీ.. ఫుట్ ఓవర్ బ్రిడ్జి కానీ కట్టించాలని డిమాండ్ చేశారు. వందలాదిగా గ్రామస్తులు హైవేపైకి చేరుకోవడంతో.. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను మోహరించారు. ఆర్డీవో వచ్చి వివరణ ఇవ్వడంతో సిచుయేషన్ కంట్రోల్ లోకి వచ్చింది. పోలీసులు…. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. దాదాపు ఆరు గంటలపాటు టెన్షన్ తర్వాత.. అర్ధరాత్రి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. పోలీసులపై దాడి విషయాన్ని డిపార్ట్ మెంట్ సీరియస్ గా తీసుకుంది. 35 మంది అనుమానితులపై కేసు నమోదుచేసినట్టు తెలిసింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy