మహాత్ముడితో కబాలీ..

rajaniకబాలీ పై టాక్ ఎలా ఉన్నా రజనీకాంత్ మీద క్రేజ్ మాత్రం తమిళనాడు లో వీసమంతైనా తగ్గలేదు. ఆయన ఫ్యాన్స్ కు ఏది తట్టినా దాన్ని రజనీతో లింక్ చేసేస్తారు. ఈ ఆగస్టు 9 కి క్విట్ ఇండియా ఉద్యమం జరిగి 75 ఏళ్ళు. అలాగే స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు.. ఈ రెంటినీ పురస్కరించుకుని వారు తమ అభిమాన హీరోను స్వాతంత్రోద్యమ కాలం నాటికి తీసుకుపోయారు. రజనీకాంత్, మహాత్మాగాంధీలు కలిసి ఉన్నట్లుగా చూపే ఓ ఫోటోను ఆన్ లైన్ లో పెట్టేశారు. వరస విజయాలలో ప్రజలను మెప్పిస్తున్న రజనీకాంత్ ను అభినందించిన మహాత్మాగాంధీ అని ఓ ట్యాగ్ కూడా తగిలించేశారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1970 ల్లో రజినీ నటించి సినిమాల్లోని బ్లాక్ అండ్ వైట్ ఫొటో లను మార్ఫింగ్ చేసి నెట్లో పెట్టేశారు.

నిజానికి రజనీ పుట్టింది 1950లో. గాంధీ 1948 లోనే చనిపోయాడు. ఈ ఇద్దరికీ లింకేమిటి.. అయినా మహాత్ముడంతటి గొప్ప మనీషికి రజనీకాంత్ ను ట్యాగ్ చేయడమేంటి..  ఇది రజనీకి కూడా ఇబ్బందికరమని ఆయన సన్నిహితులు అంటున్నారు. కానీ ఫ్యాన్స్ కు ఎమోషన్సే కానీ లాజిక్ ఉండవు కదా.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy