మహానటి జయంతి: పాటకు ప్రాణం ఆమె నటన

maha nati- savitriమహానటి అన్న పేరుకు అసలైన రూపం.. సావిత్రి. ఆమె బతికున్నది 45 ఏళ్లే అయినా.. టాలీవుడ్ చరిత్రలో తనకంటూ హిస్టరీని క్రియేట్ చేసుకున్నారు. తెలుగు సినిమా ఉన్నంత కాలం.. సావిత్రి పేరు నిలిచిపోయేంతగా.. తన నటనతో అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఇవాళ సావిత్ర జయంతి సందర్భంగా… ఆమె నటించిన సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ పై స్పెషల్ స్టోరీ…

నటిగా.. దర్శకురాలిగా.. నిర్మాతగా.. మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు… మహానటి సావిత్రి. ఎన్టీఆర్, ఏఎన్నార్, భానుమతి లాంటి సీనియర్ నటులతో పోటీ పడి.. అభిమానుల్ని సంపాదించుకున్న క్రెడిట్… సావిత్రికే దక్కింది. యాక్టింగ్ తోనే కాక.. పాటల్లో ఆకట్టుకునే ఎక్స్ ప్రెషన్లకు ఆమె కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. మూగ మనసులు మూవీలో సావిత్రి నటన.. సినిమాకు ప్రాణం పోసింది.

మాయాబజార్ సినిమా.. సావిత్రి నటనకు పీక్ స్టేజ్. అహ నా పెళ్లంట పాటలో ఆమె ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ గురించి.. ఎంత చెప్పుకున్నా తక్కువే.

గుండమ్మ కథ సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్, జమునకు దీటుగా సావిత్రి నటించారు. కోలో కోలోయమ్మ కోలో నాసామి అంటూ నలుగురూ కలిసి యాక్ట్ చేసిన పాట… ఆమె కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్.

సహజమైన నటనతో నవ్వులు పూయించాలన్నా అందరి కంటా కన్నీళ్లు తెప్పించాలన్నా .. అది సావిత్రికే సొంతం. దేవదాసు సినిమాలో సావిత్రి యాక్టింగ్ చూసిన వాళ్లెవరైనా ఈ మాట ఒప్పుకోవాల్సిందే.

ఎన్టీఆర్, సావిత్రి కెరీర్ లోనే కాదు. తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే సినిమా రక్త సంబంధం. ఈ మూవీలోని చందురిని మించు అందమొలికించు పాట.. ఇప్పటి తల్లులు కూడా చంటిపిల్లలు కూడా పాడేంత లాలిపాటగా ఫేమస్.

మిస్సమ్మలో రావోయి చందమామ పాట.. టాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్స్ లో ఒకటి. సావిత్రి నటన.. ఈ పాటకే కాదు.. సినిమాకూ నిండుదనం తెచ్చింది.

భార్యాభర్తల అనుబంధాన్ని వివరించే పాట.. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి. ఎన్టీఆర్ తో జతకట్టి సావిత్రి యాక్ట్ చేసిన దేవత సినిమాలోని ఈ సాంగ్ కు.. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీనే..

చదువుకున్న అమ్మాయిలు సినిమాలోని వినిపించని రాగాలే.. కనిపించని అందాలై పాటలో.. ఆ మహానటి ఎక్స్ ప్రెషన్స్ హైలెట్. ఈ పాట… ఇప్పటి హీరోయిన్లకు మంచి లెస్సన్.

కలసి ఉంటే కలదు సుఖమా మూవీ  సావిత్రి కెరీర్ లో ఇంకో మైల్ స్టోన్. ఈ సినిమాలోని ముద్దబంతి పూవులు పెట్టి పాటలో సావిత్రి, ఎన్టీఆర్ ల నటన… అందరినీ మెప్పించింది.

చివరి సినిమా గోరింటాకులో.. గోరింటాపూచిందీ కొమ్మా లేకుండా పాటలో సావిత్రి నటించారనేకంటే జీవించారని చెప్పొచ్చు. ఈ సినిమాతోనే… సావిత్రి నట జీవితానికి ఎండ్ కార్డ్ పడింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy