మహానటి..ఫస్ట్  సాంగ్ రిలీజైంది

MAHANATIఅలనాటి తార సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. కీర్తి సురేష్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ సందర్భంగా శుక్రవారం(ఏప్రిల్-20) సినీ బృందం మూవీలోని మొదటి పాటను విడుదల చేసింది. ‘మూగ మనసులు.. మన్ను మిన్ను కలుసుకున్న సీమలో..’ అంటూ సాగే గీతం ఆకట్టుకుంటోంది.

మిక్కీ జె.మేయర్‌ బాణీలు అందించిన ఈ గీతానికి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. శ్రేయాఘోషల్‌, అనురాగ్‌ కుల్‌కర్ణి దీన్ని ఆలపించారు. దుల్కర్‌ సల్మాన్‌, కీర్తిసురేష్‌ ఇందులో ఆడిపాడారు.  వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వనీదత్‌, ప్రియాంకదత్‌, స్వప్నదత్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy