మహానటి లుక్ : ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు

MOHAN MAHAహీరోయిన్ కీర్తి సురేశ్ లీడ్ రోల్ లో.. అలనాటి తార సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. నాగ్ అశ్విన్ డెరెక్షన్ లో సమంత, విజయ్ దేవరకొండ తదితరులు నటించిన ఈ సినిమా మే-9న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సెన్సార్ (U) సహా..అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ..ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇప్పటికే టీజర్, పోస్టర్స్, ఆడియోతో ఆకట్టుకుంటున్న ఈ సినిమా..లేటెస్టుగా ఇందులో నటించిన క్యారెక్టర్లకు సంబంధించిన స్టిల్స్ అందరిని ఇంప్రెస్ చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఆదివారం (మే-6) ఈ మూవీలో ఎస్వీ రంగారావు పాత్రకు సంబంధించిన క్యారెక్టర్‌ ను రిలీజ్ చేసింది సినిమా యూనిట్. సినీ నటుడు నాని ఆ పాత్రను వీడియోలో పరిచయం చేశారు. ఇందులో మోహన్‌బాబు.. విలక్షణ నటుడు ఎస్వీ రంగారావు పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో ఎల్వీ ప్రసాద్‌గా అవసరాల శ్రీనివాస్, కేవీ రెడ్డిగా క్రిష్ కనిపిస్తున్న వీడియోలను శనివారం నాని విడుదల చేసిన విషయం తెలిసిందే.


Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy