మహాబలేశ్వర్ లో కుంభవృష్టి- ఉప్పొంగిన కృష్ణా

water-flowమహారాష్ట్ర లోని మహాబలేశ్వర్ లో మున్నెన్నడూ లేనంతగా కుంభవృష్టి కురుస్తోంది. ఇవాళ ఒక్క రోజే 41 సెంటీ మీటర్ల వర్షం పడింది. దీంతో గడచిన రెండు రోజుల్లో కురిసిన వర్షం 80 సెంటీ మీటర్లు దాటింది. 2008 తరువాత ఇంత భారీగా వర్షం పడడం ఇదే తొలిసారి. పశ్చిమ కనుమల్లో ఉన్న మహాబలేశ్వర్ లో ప్రతీ ఏటా ఆగస్టులో సగటున 1778.4 మిల్లీ మీటర్ల వర్షం కురుస్తుంది. ఈ ఆగస్టులో ఇప్పటికే 915 మిల్లీమీటర్ల వర్షం దాటింది. కొంకణ్, గోవాల్లో రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో వర్షం ఆగడం లేదు.

కృష్ణా నది పుట్టింది మహాబలేశ్వర్ లోనే.. వర్షాలకు కృష్ణా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దాంతో భారీగా నీరు కిందకి వదిలేస్తున్నారు. నది కింద ఉన్న దాదాపు అన్ని భారీ ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరొస్తోంది. అటు మహారాష్ట్ర, కర్నాటకే కాదు… తెలుగురాష్ట్రాల్లోని జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బరాజ్… అన్నింటిలోకి భారీగా నీరొచ్చి చేరుతోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy