‘మహాభారతం’పై కన్నేసిన నాగ్!

Nagarjuna‘మనం’ వంటి క్లాసికల్ మూవీ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు నాగార్జున. ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ పై కన్నేశాడు ఈ టాలీవుడ్ మన్మథుడు. ‘మహాభారతం’ ఆధారంగా తీసే పౌరాణిక సినిమాలో యాక్ట్  చేయడానికి రెడీ అవుతున్నాడు నాగ్. మలయాళంలో వాసుదేవన్ నాయర్ అనే రైటర్ భీముని చుట్టూ తిరిగే మహాభారతం నావెల్ ను రచించాడు. ఈ నావెల్ కు ప్రతిష్టాత్మక ‘జ్ఞాన్ పీఠ్’ అవార్డు కూడా వచ్చింది. ఈ నావెల్ ఆధారంగా సినిమా చేసే ప్రపోజల్ ను రీసెంట్ గా నాగ్ ముందుకు తెచ్చారు కొందరు నిర్మాతలు. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళ భాషల్లో ఈ మూవీ రూపొందనుంది. అమితాబ్ బచ్చన్, మోహన్ లాల్, విక్రం వంటి యాక్టర్స్ కూడా ఇందులో యాక్ట్ చేయనున్నారని టాక్. అయితే ఈ ప్రపోజల్ పై నాగార్జున ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నారు. ఒకవేళ ఈ మూవీ తెరకెక్కి, అందులో నాగ్ కూడా యాక్ట్ చేస్తే అతని కెరీర్లో బిగ్గెస్ట్ మూవీగా నిలవడం ఖాయం.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy