మహారాష్ట్రలో ప్లాస్టిక్ వాడితే జైలే : ఉగాది నుంచి అమలు

maha plasticప్లాస్టిక్ వాడొద్దని ప్రభుత్వాలు ఎన్ని సార్లు చెప్పిన మార్పు రాకపోవడంతో, కఠిన నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరైన ప్లాస్టిక్ వాడితే రూ.25 వేల ఫైన్ తో పాటు 3 సంవత్సరాలు జైలుశిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. మహారాష్ట్రీయుల నూతన సంవత్సరం గుడి పడ్వా (మార్చి-18) నుంచి రాష్ట్రంలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఆదివారం (మార్చి-18) నుంచి నిషేధాన్ని అమలుచేస్తామని పర్యావరణశాఖ మంత్రి రామ్‌దాస్ కదమ్ శుక్రవారం (మార్చి-16) అసెంబ్లీలో ప్రకటించారు. ప్లాస్టిక్ ఉత్పత్తి, వినియోగం, నిల్వ, విక్రయాలు, పంపిణీ, రవాణాపై నిషేధం ఉంటుందని ఆయన చెప్పారు. ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే రూ.25 వేల జరిమానాతో పాటు, మూడేండ్ల జైలు శిక్ష  విధించే అవకాశం ఉన్నదన్నారు.ప్లాస్టిక్ సంచులు, థర్మోకోల్, వాడిపారేసే కప్పులు, ప్లేట్లు తదితరాలపై నిషేధం ఉంటుందని తెలిపారు.

ఔషధాలు, అటవీ, ఉద్యాన ఉత్పత్తుల ప్యాకింగ్ కోసం, ఘనవ్యర్థాలు, మొక్కలు పెంచేందుకు, ప్రత్యేక ఆర్థికమండళ్లలో ఎగుమతులు చేపట్టేందుకు ప్లాస్టిక్‌ను ఉపయోగించవచ్చని, వీటికి నిషేధం వర్తించదని వివరించారు. 50 మైక్రాన్ల మందంతో కూడిన కవర్లలో పాలు సరఫరా చేయాలని, వీటిని రీసైకిల్ చేయాలని మంత్రి చెప్పారు. పాల ప్యాకెట్లను తిరిగి కొనుగోలుచేసి రీసైక్లింగ్ చేయాలని, ఇందుకు 50పైసలకు మించి ఖర్చుకాదని పేర్కొన్నారు. వినియోగించిన పాలప్యాకెట్లను డెయిరీ పరిశ్రమ తప్పనిసరిగా తిరిగి తీసుకోవాలని స్పష్టంచేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy