మహారాష్ట్రలో మునిగింది : కాళేశ్వరంలో బయటపడిన 11 ఏళ్లనాటి పడవ

boat11 ఏళ్ల క్రితం కొట్టుకుపోయిన పడవొకటి.. కాళేశ్వరంలో ప్రత్యక్షమైంది. గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగడంతో 2006, ఆగస్టులో అది కొట్టుకుపోయింది. దానికోసం ఎంతో వెదికారు. ఎక్కడెక్కడో చూశారు. లక్షన్నర ఖర్చు పెట్టారు. అయినా దొరకలేదు. ఇక పోయిందనుకుని.. అంతా మర్చిపోయిన క్షణంలో కాళేశ్వరంలో కనపడింది. దీంతో ఆశ్చర్యంతో పాటు.. ఆనందంలో మునిగిపోయారు గంగపుత్రులు. వివరాల్లోకి  వెళితే.. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరొంచకి చెందిన గంగపుత్రులకు సంబంధించిన పడవ అది. గోదావరిపై ప్రయాణికులను తెలంగాణ –మహారాష్ట్రకు చేరవేస్తూ జీవనం సాగించేవారు గంగపుత్రులు. ఈ క్రమంలో 2006 ఆగస్టులో కాళేశ్వరం గోదావరి ఒడ్డున నాటుపడవను కర్రకు కట్టి గంగపుత్రులు నిద్రించారు. అర్ధరాత్రి ఒక్కసారిగా గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి పెరగడంతో ఆ నాటుపడవ వరదలో కొట్టుకుపోయింది. పడవ కోసం ఎంతగా ప్రయత్నించినా ఆచూకీ దొరకలేదు. ఈ క్రమంలో అంతర్రాష్ట్ర వంతెనకు దగ్గరలో జాలర్లు చేపల కోసం వలలు వేయగా కర్రకు ఏదో అడ్డు తగిలింది. అనుమానం వచ్చిన గంగపుత్రులు నీటిలో చూడగా.. దాన్ని పడవగా గుర్తించారు. దానిపై ఇసుక కప్పేయడంతో మంగళవారం 40 మంది గంగపుత్రులు ఇసుకను తోడుతూ పడవను సాయంత్రానికి బయటికి తీశారు. ప్రస్తుతం పడవ విలువ రూ.6 లక్షలకుపైగా ఉంటుందని అంటున్నారు గంగపుత్రులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy