మహారాష్ట్ర నేతలను వణికిస్తున్న ఈడీ

Chhagan-Bhujbal-v6మహారాష్ట్ర రాజకీయాల్లో భారీ కుదుపు. ఆ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత ఛగన్ భుజ్ బల్ ఇంటిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రెయిడ్ చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలపై భుజబల్ పై రెయిడ్ చేసిన ఈడీ 110 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఈ దాడులతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న పొలిటీషియన్స్ చాలామంది అలర్ట్ కూడా అయినట్టు తెలుస్తోంది.

ముంబైలో రిచ్ ఏరియా అయిన బాంద్రాలోని ఛగన్ భుజ్ బల్ కు చెందిన రెండు స్థలాలను ఈడీ అటాచ్ చేసినట్టు సమాచారం. అమితే వీటి మార్కెట్ వ్యాల్యూ… 110కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ స్థలాలు… భుజబల్ ఫ్యామిలీకి చెందిన ప్రవేశ్ కన్ స్ట్రక్షన్ కు చెందినవి. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద వీటిని అటాచ్ చేశారు. మనీ లాండరింగ్ కేసులో ముంబై పోలీసులు రిజిస్టర్ చేసిన FIR ఆధారంగా ED దర్యాప్తు చేస్తోంది. 2014 డిసెంబర్ 18న ముంబై హైకోర్టు నేతలు, ఇతరుల ఆస్తులపై ED డైరెక్టర్, ఆ రాష్ట్ర ACB డీజీపీలతో… స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఛగన్ భుజబల్ కంటే ముందు… కొన్ని ఆస్తులను అటాచ్ చేసింది ED. రియాలిటీ కంపెనీకి చెందిన 160కోట్ల విలువైన ప్లాట్, 17కోట్ల విలువైన ఇతర ఆస్తులను కూడా ED సీజ్ చేసింది.

ED అటాచ్ చేసిన ఆస్తులతో నాకే సంబంధంలేదు. ఎందుకు అటాచ్ చేశారో కూడా తెలియదన్నారు. తానెలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు.  ఛగన్ భుజబల్ ఆస్తులన్నింటిపై దర్యాప్తు చేయించాలని బీజేపీ డిమాండ్ చేసింది. సింగపూర్ లో భుజబల్ కు ఫైనాన్స్ కంపెనీ ఉందని… దానిపై ఎంక్వైరీ చేయాలన్నారు బీజేపీ నేతలు

ఇక మహారాష్ట్రలో ED దాడులపై ఈ నెల 18న ఆర్థిక శాఖా సహాయ మంత్రి జయంత్ సిన్హా లోక్ సభలో రాతపూర్వక ప్రకటన కూడా చేశారు. మరోవైపు తాము చేసిన పోరాటం ఫలితంగానే… మహారాష్ట్రలో… ED రెయిడ్స్ జరుగుతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ క్లెయిమ్ చేసుకుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy