మహారాష్ట్ర లో ప్రభుత్వం నిలిచేనా?

41415597053_625x300మహారాష్ట్రలో పొత్తుల రాజకీయాలు చివరి దశకు చేరుకున్నాయి. అసెంబ్లీలో రేపు విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది బీజేపీ సర్కార్. మహారాష్ట్ర అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేన, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని శాసన సభ కార్యదర్శికి లెటర్ రాసింది. మరో వైపు బీజేపీతో పొత్తుపై చర్చలకు సిద్దమంటూ సిగ్నల్స్ ఇస్తోంది. అసెంబ్లీలో సాధారణ మెజారిటీకి 23 స్థానాల దూరంలో నిలిచింది కమలం పార్టీ. దీంతో శివసేన, ఎన్సీపీ లలో ఎవరి మద్దతు తీసుకోవాలనే దానిపై తీవ్రంగా చర్చిస్తున్నారు బీజేపీ పెద్దలు. బీజేపీకి మద్దతు ఇవ్వడానికి డిప్యూటీ సీఎం పదవితో పాటు, రెండు మంత్రి పదవులు కోరుతోంది శివసేన. మరోవైపు ఎలాంటి పదవులు ఇవ్వకున్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయమని ప్రకటించింది శరద్ పవార్ పార్టీ. అయితే మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ ని సపోర్ట్ చేసిన ఎన్సీపీ మద్దతు తీసుకోవడం కన్నా, ఎన్డీఏ ను సపోర్ట్ చేసిన శివసేన మద్దతే మేలని భావిస్తున్నారు బీజేపీ పెద్దలు.  రీసెంట్ ఎలక్షన్స్ లో  122 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకొని బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే 288 స్థానాలు  గల సభలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి  145 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. శివసేన 63, కాంగ్రెస్‌ 42, ఎన్సీపీ 41 స్థానాలను సాధించాయి.  దీంతో రేపు జరిగే విశ్వాస పరీక్షలో ఫడ్నవీస్ ప్రభుత్వం గెలుస్తుందా…గెలవడానికి ఎవరి మద్దతు తీసుకుంటుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy