మహారాష్ట్ర సీఎం చవాన్ రాజీనామా..!

prithvirajమహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎన్సీపీ తమ మద్దతు ఉపసంహరించుకోవడంతో సీఎం పృథ్వీరాజ్ చవాన్ తన పదవికి రాజీనామా చేశారు. చాలా కాలంగా ఎన్సీపీ – కాంగ్రెస్ పార్టీలు కూటమిగా ఉన్నాయి. కాని, వచ్చే నెలలో మహారాష్ట్రలో ఎన్నికలు ఉండగా, కాంగ్రెస్ పార్టీతో సీట్లు సర్దుబాటు కాకపోవడంతో ఆ పార్టీల బంధం తెగిపోయింది.అయితే, సీఎం రాజీనామా చేయడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. ఇప్పటికే గవర్నర్ ని కలిసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని బీజేపీ నాయకులు కోరారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy