మహా మేధావి : ఐక్యూలో ఐన్‌స్టీన్ ను దాటేసిన బుడ్డోడు

rahul-doshiఐక్యూలో ఐన్ స్టీన్ ను మించిపోతున్నారు భారతీయ విద్యార్థులు. తాజాగా బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన 12ఏళ్ల దోషి రాహుల్ ఐక్యూలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌లను దాటేశాడు. చానల్-4 నిర్వహించిన టెలివిజన్ క్విజ్ పోటీల్లో విజయం సాధించాడు రాహుల్. ఐక్యూ 162తో అందరినీ ఆకట్టుకున్నాడు. నిన్నటివరకు సామాన్యుడిగా ఉన్న బాలుడు క్విజ్ పోటీల్లో ఒక్కో రౌండ్‌లో చకచకా సమాధానాలు చెప్పి సత్తాచాటుతూ.. చివరి రౌండ్‌లో తొమ్మిదేండ్ల రోనన్‌ను 10-4తో ఓడించి తాజా సిరీస్‌లో విజయంతో సంచలనాలకు మారుపేరయ్యాడు. . ప్రపంచంలోనే అతిపెద్ద, అతి పురాతనమైన ఉన్నత ఐక్యూ సమాజం- మెన్సాక్లబ్‌కు సైతం సభ్యుడిగా రాహుల్ అర్హత సాధించాడు. ఈ విజయం తమకెంతో ఆనందాన్నిచ్చిందంటున్నారు రాహుల్ తండ్రి మినేశ్, తల్లి కోమల్.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy