మహిళను ఈడ్చుకెళ్లిన ముంబై పోలీసులు

71443435853_625x300ముంబై పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ మహిళ పట్ల ముంబై పోలీసులు ప్రవర్తించిన తీరు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ముంబైలోని ఓ వీధిలో గణేశ్ విగ్రహాన్ని చూడ్డానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఇంతలో ఓ మహిళ వీఐపీ గేటులోకి ప్రవేశించింది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఆమె మాట వినకుండా తీవ్రంగా కొట్టి జుట్టు పట్టుకొని ఈడ్చుకు వెళ్లారు. పొరపాటున చేసిన దానికి ఇంత శిక్షా అంటూ…. పోలీసుల తీరున తీవ్రంగా విమర్శిస్తున్నారు ముంబై వాసులు. ప్రస్తుతం ఈ వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది. దీనిపై విచారణకు ఆదేశించారు ఆ రాష్ట్ర సీఎం దేవంద్ర ఫడ్నవీస్.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy