మహిళలకు లీడర్ షిప్ క్వాలిటీ ఉండాలి : కవిత

KKమహిళలకు లీడర్ షిప్ క్వాలిటీ ఉండాలన్నారు ఎంపీ కవిత. కొన్ని సందర్భాలలో కోపం తగ్గించుకుని.. అవసరం ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలన్నారు. పార్క్ హయత్ హోటల్ లో నల్సార్ యూనివర్సిటీ నిర్వహిస్తున్న.. లీడర్ షిప్ సమ్మిట్ – 2018 బై ఉమెన్.. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎంపీ కవిత. టైమ్స్ గ్రూప్ కన్స ల్టింగ్ ఎడిటర్ సాగరిక ఘోష్, TIE అధ్యకులు కాళిప్రసాద్, CII చైర్ పర్సన్ శోభా దీక్సిత్, మాజీ చైర్ పర్సన్ కరుణ గోపాల్, నల్సార్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఫైజన్ ముస్తఫా పాల్గొన్నారు. మహిళా సభలు కేవలం మార్చి వరకే కాకుండా.. ప్రతి నెలలో మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు కవిత. రాజకీయాల్లోకి వారసత్వంగా వచ్చే మహిళలను ప్రశ్నిస్తున్న వారు.. పురుషులను కూడా నిలదీయాలన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy