మహిళలూ…పొగరాణులూ…

603aa3c618dfb0e36b85863761ad1b20Pilgrim_Smoking_Beedi_-_Gangasagar_Fair_Transit_Camp_-_Kolkata_2013-01-12_2707సిగరెట్ తాగడంలో ఇండియా బాగా డెవలప్ అయిపోయింది. 1998 కన్నా 2012 వచ్చేసరికి సిగరెట్ తాగేవారి సంఖ్య డబుల్ కన్నా ఎక్కువయింది. అయితే ఇక్కడ విచిత్రమేమిటంటే ఇక్కడ గుప్ గుప్ మని పొగలు వదులుతున్నది మగవారు కాదు….ఆడవారు. పొగతాగే స్త్రీల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోందట. క్లబ్ లని, పబ్ లని తిరుగుతూ సిగరెట్లు తెగతాగస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. మరో విచిత్రం ఏంటంటే అబ్యాయిల్లో మాత్రం పొగపీల్చేవారి సంఖ్య బాగా తగ్గుతోందట. డబ్బు ఖర్చు, ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టిన అబ్బాయిలు సిగరెట్ ను మానేస్తుంటే అమ్మాయిలు మాత్రం తెగ పొగపీల్చేస్తున్నారు. 1980 నుంచి 2012 వరకు మొత్తం 187 దేశాల్లోని ప్రజల సిగరెట్ అలవాట్లను పరిశీలించిన అమెరికన్, బ్రిటిష్ మెడికల్ మ్యాగజైన్స్ ఈ మార్పును స్పష్టంగా గమనించాయి. భారతీయ పురుషుల్లో పొగ తాగేవారి సంఖ్య 33.8 శాతం నుంచి 23 శాతానికి తగ్గిపోతే, ఇంతులలో మాత్రం పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా చుట్టలు, తంబాకు.. ఇలా ఏదో ఒకపేరుతో పొగతాగే మహిళల సంఖ్య ఎక్కువగానే ఉంటోందిట. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో ఇది బాగా కనిపిస్తున్నాదని చెబుతున్నారు. 1980 నాటికి మన దేశంలో దాదాపు 53 లక్షల మంది పొగరాణులుంటే, 2012 నాటికి ఆ సంఖ్య ఏకంగా 1.22 కోట్లకు చేరుకుంది. అంటే రెట్టింపునకు పైగా పెరిగిపోయిందన్న మాట.
స్త్రీలు పొగతాగడం ఎంత మాత్రం మంచిది కాదు అంటున్నారు డాక్టర్లు. కేన్సర్ ఎవరికైనా వస్తుంది కానీ దానికన్నా ముందు ప్రెగ్నెన్సీ ప్రాబ్లెమ్స్ వస్తాయని చెబుతున్నారు. సిగరెట్ తాగడం వల్ల పిల్లలు పుట్టకపోయే ఛాన్స్ ఉందని అంటున్నారు. కాబట్టీ పొగరాణులూ తస్మాత్ జాగ్రత్త. ఏదో సరదాగా ఉంది…స్టేటస్ సింబల్ అంటూ దమ్ము పీల్చడానికి రెడీ అయిపోతున్నారేమో…అలా అయితే ఫ్యూచర్ మీద మాత్రం ఆశలు వదిలేసుకోండి. జీవితం మీద ఎటువంటి ఆశలూ లేవనుకుంటేనే పొగతాగడానికి సిద్ధంకండి. ఇక మీ సంగతి అబ్బాయిలూ…ప్రాబ్లెమ్స్ అమ్మాయిలకే చెబుతున్నారు….మాకే కాదు అనుకుంటూ ధూమపానానికి రెడీ అయిపోతున్నారేమో…ఒక్కసారి వెనక్కు చూడండి, కేన్స్ భూతం తరుముకొచ్చేస్తోంది…బీ కేర్ ఫుల్.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy