మహిళలే టార్గెట్‌: బీజేపీ మ్యానిఫెస్టో

bjpకర్ణాటకలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మరింత స్పీడప్ చేశాయి. ఓటర్లలో ప్రధాన వర్గమైన పేద, మధ్యతరగతి వర్గాల మహిళలను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టాయి. వీరిని ఆకర్షించడమే ధ్యేయంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఫ్రీగా స్మార్ట్‌ఫోన్‌లు, కేవలం 1శాతం వడ్డీతోనే రుణాల మంజూరు, మహిళల భద్రత కోసం ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఏర్పాటు లాంటి హమీలతో మహిళా ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తోంది.

అధికారంలోకి వస్తే మహిళల భద్రత కోసం ‘కిట్టూరు రాణి చెన్నమ్మ’ పేరిట ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేస్తామని బీజేపీ తన మ్యానిఫెస్టోలో తెలిపింది. మహిళల సమస్యలను పరిష్కరించడానికి మహిళా పోలీసు అధికారి అధ్వర్యంలో ‘స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ సెల్‌’ను ప్రారంభించి, 1000 మంది మహిళా పోలీసు అధికారులను నియమిస్తామని తెలిపింది. ‘స్త్రీ సువిధ పథకం’ కింద బీపీఎల్‌ కుంటుంబాల మహిళలకు, ఆడ పిల్లలకు ఉచితంగా, మిగితా స్త్రీలకు కేవలం ఒక్క రూపాయకే సానిటరీ నాప్‌కిన్‌లను అందజేస్తామని ప్రకటించింది.  ‘ముఖ్యమంత్రి స్మార్ట్‌ఫోన్‌ యోజన’ కింద  BPL కుటుంబాలకు చెందిన మహిళలకు ఫ్రీగా స్మార్ట్‌ఫోన్లను ఇస్తామని తెలిపింది.

అలానే 10 వేల కోట్ల రూపాయలతో ‘స్త్రీ ఉన్నతి ఫండ్‌’ను, ‘స్త్రీ ఉన్నతి స్టోర్‌’లను ఏర్పాటు చేయడమే కాక పొదుపు సంఘాల మహిళలకు 1 శాతం వడ్డీకే 2 లక్షల రూపాయల రుణం ఇస్తామని ప్రకటించింది. మహిళలను మాత్రమే కాక రైతులను ఆకట్టుకోవడం కోసం 15 వేల కోట్ల రూపాయలతో వివిధ సాగునీటి పథకాలను ప్రారంభిస్తామని బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యురప్ప తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy