మహిళల్లో ఆరోగ్య సమస్యలు: బయట తిండి మానేయాలట

 మహిళల్లో  విటమిన్  బీ12  లోపం  పెరుగుతోంది.  ముఖ్యంగా  గర్భిణీలు, బాలింతల్లో  ఈ సమస్య  తీవ్రంగా  ఉందంటున్నారు  డాక్టర్లు.  దీంతో  రక్తహీనత, డిప్రెషన్  లాంటి  ఆరోగ్య సమస్యలు  వస్తున్నాయంటున్నారు.  బయటి  ఆహారం ఎక్కువగా   తీసుకోవడం… పోషకాహార  లోపంతోనే  ఈ ఆరోగ్య  సమస్యలు పెరుగుతున్నాయని  చెబుతున్నారు.  మహిళల్లో   బీ12  లోపానికి  కారణాలేంటో చూద్దాం..

మహిళలను ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు పెడుతున్నాయి. చిన్నవే కదా అని అశ్రద్ద చేస్తుండటంతో సమస్యలు పెరిగి పెద్దదవుతున్నాయి. నాణ్యమైన భోజనం, కార్బోహైడ్రేడ్లు ఉన్న ఆహారం తీసుకోకపోవడంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటున్నారు డాక్టర్లు. ఈతరం మహిళల్లో ఎక్కువగా బీ12 లోపం కనిపిస్తోందని చెబుతున్నారు. శాకాహారుల్లోనే ఈలోపం ఎక్కువగా ఉంటోదని చెబుతున్నారు.  డెయిరీ ఉత్పత్తులు, పాలను తక్కువగా తీసుకుంటున్నావారిలోనూ లోపం కనిపిస్తోందని చెబుతున్నారు.

బీ12 లోపం ఉన్న మహిళలు రోజంతా అలసటగా ఉంటారంటున్నారు డాక్టర్లు. ఎర్ర రక్తకణాల తయారీలో బీ12 కీలక పాత్ర పోషిస్తోందని చెబుతున్నారు. బీ12 లోపించడంతో కంటి సమస్యలు, జ్ఞాపకశక్తి తగ్గడం, డిప్రెషన్, మెదడులో సమస్యలు కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు రావడం, జుట్టు ఊడటం లాంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

బీ12 సమస్య ప్రధానంగా గర్భిణీలు,  బాలింతలలో ఎక్కువగా కనిపిస్తోంది. నెలలు నిండకుండా పిల్లలు పుట్టడం, పుట్టిన బిడ్డకు ఎముకలు దృఢంగా లేకపోవడం,  రక్త హీనత లాంటి ఎన్నో సమస్యలు వస్తున్నాయంటున్నారు. ఇక తల.. మెదడు.. వెన్నుపూస సరిగ్గా పూడుకోకపోవడం లాంటి సమస్యలు కనిపిస్తున్నాయని రుజువైందని చెబుతున్నారు. బీ12 లోపించడంతో ఆటిజం కూడా వస్తోందంటున్నారు డాక్టర్లు.

బీ12 లోపించిన వారు… మాంసం, గుడ్లు, డెయిరీ ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. సమస్య తీవ్రతను బట్టి డాక్టర్ల సూచనతో మందులు, ఇంజెక్షన్స్ వాడాలని సూచిస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy