మహిళల భద్రత: రాజ్యసభలో గళం విప్పిన మహిళా ఎంపీలు

mayaదేశవ్యాప్తంగా మహిళలపై దాడుల వ్యవహారం రాజ్యసభను కుదిపేసింది. సభ ప్రారంభం కాగానే… పార్టీలతో సంబంధం లేకుండా మహిళా ఎంపీలు… ఈ విషయంపై చర్చకు పట్టుబట్టారు. కొద్దిసేపు గలాటా జరిగిన తర్వాత… కేంద్రమంత్రి నఖ్వీ సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది

రాజ్యసభలో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడంలో ముందున్నారు బీఎస్పీ చీఫ్ మాయావతి. దేశంలో మహిళలపై అత్యాచారాల అంశాన్ని సభలో ప్రస్తావించారామె. దేశవ్యాప్తంగా మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ పరిస్థితి తీవ్రంగా ఉందన్న మాయా… ప్రభుత్వం సైలెంట్ గా ఎందుకు ఉందని ప్రశ్నించారు.

ఇదే ఇష్యూపై ఎమోషనల్ అయ్యారు సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్. ఇష్యూని రాజకీయం చేయడం తనకిష్టంలేదన్న జయ… చర్చ జరగాల్సిందేనన్నారు. ఘటనలు ఎక్కడ జరిగాయన్నది… అప్రస్తుతమన్నారు.

సభ్యుల డిమాండ్ కు ఒకే అన్నారు పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

నఖ్వీ చర్చకు సై అన్నా గొడవ తగ్గలేదు. చర్చ జరగాలా..? వద్దా..? అనే అంశంపై రేపు చర్చిద్దామని డిప్యూటీ చైర్మన్ కురియన్ సర్దు చెప్పడంతో ఎంపీలు శాంతించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy