మహిళల రక్షణ కోసం హెల్ప్ లైన్ సెంటర్..!

download (5)మహిళల రక్షణ కోసం ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి…పెరుగుతున్నాయి. దీంతో మహిళలపై దాడులను అరికట్టేందుకు హెల్ప్ లైన్ సెంటర్ ను ఏర్పాటు చేసింది ఛత్తీస్ ఘడ్ సర్కార్.  ఈ హెల్ప్ లైన్ సెంటర్ 24 గంటలూ పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. మహిళలకు రక్షణ కల్పించడం కోసం..ఫస్ట్ టైం రాష్ట్రంలో ఈ హెల్ప్ లైన్ సెంటర్ ను ఇంట్రడ్యూస్ చేయనున్నారు. 181 అనే నెంబర్ తో ఉన్న ఈ లేడీ హెల్ప్ లైన్ త్వరలోనే ఓపెన్ కానుంది.

ఈ హెల్ప్ లైన్ ను ఒకట్రెండు నెలల్లో స్టార్ట్ చేస్తామని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ సుబ్రత్ సాహు తెలిపారు. ప్రస్తుతం ట్రైయిల్స్ జరుగుతున్నాయని…దీని గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ హెల్ప్ లైన్ తో ఫాస్ట్ గా చర్యలు తీసుకోవచ్చని ఆయన అన్నారు. రాయ్ పూర్, దుర్గ్ ప్రాంతాల్లో నోడల్ ఏజన్సీలు ఉంటాయని, అక్కడి నుంచే హెల్ప్ లైన్ సెంటర్ కార్యకలాపాలు జరుగుతాయని సుబ్రత్ చెప్పారు.

ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకున్నాక ఘటన జరిగిన ప్రాంతానికి  దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు సమాచారం అందిస్తామని..ఆయన అన్నారు. రాష్ట్రంలో 2013 నుంచి ఈ ఏడాది జనవరి 15 వరకూ 1,137 రేప్ కేసులు బుక్ అయ్యాయని,2012-13లో 1,145 కేసులు, 2011-12లో 1,076 కేసులు…2010-11 మధ్య 1,128 అత్యాచార కేసులు నమోదైయ్యాయని..వీటిని నివారించేందుకే హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామన్నారు సెక్రటరీ సుబ్రతా సాహు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy