మహిళా డైరెక్టర్ల సంఖ్య పెరగాలి : జయ

DSC_1322జర్నలిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించి రచయిత్రిగా, ‘సూపర్‌హిట్‌’ పత్రిక జనరల్‌ మేనేజర్‌గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న జయ బి, సినిమాల మీద మక్కువతో ‘చంటిగాడు’ చిత్రంతో దర్శకురాలిగా మారి ‘గుండమ్మగారి మనవడు’, ‘లవ్‌లీ’ ‘వైశాఖం’ లాంటి ఫీల్‌గుడ్‌ మూవీస్‌ని ప్రేక్షకులకందించి దర్శకురాలిగా తనకంటూ ఓ స్పెషల్‌ ఇమేజ్‌ని తెచ్చుకున్నారు డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. ‘వైశాఖం’ చిత్రంతో ప్రేక్షకుల ప్రశంసలతో పాటు సిల్వర్‌ క్రౌన్‌ అవార్డ్‌ పొందిన జయ బి. పుట్టినరోజు జనవరి 11. ఈ సందర్భంగా జనవరి 10న హైదరాబాద్‌ దసపల్లా హోటల్‌లో ప్రెస్‌మీట్‌ని ఏర్పాటు చేశారు.

‘లక్కీఫెలో’ జూన్‌లో ప్రారంభం… 

”వైశాఖం’ చిత్రం పూర్తిగా నాకు సంతృప్తిని కలిగించిందన్నారు డైరెక్టర్‌ జయ. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించి పెద్ద హిట్‌ చేశారు. చాలామంది ‘సినిమా చాలా బాగుంది.. మంచి సినిమా తీశారు’ అని అప్రిషియేట్‌ చేశారు. నెక్స్‌ట్‌ మా ఆర్‌.జె. సినిమాస్‌ బేనర్‌లో ‘లక్కీఫెలో’ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. జూన్‌లో సినిమా స్టార్ట్‌ చేసి మూడు నాలుగు నెలల్లో షూటింగ్‌ కంప్లీట్‌ చేస్తాం. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. ఓ యంగ్‌ హీరో ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఆ హీరో ఎవరనేది త్వరలోనే ఎనౌన్స్‌ చేస్తామన్నారు.

హీరోయిన్‌ క్యారెక్టర్‌ చాలా స్ట్రాంగ్‌… 

అలాగే హీరోతో పాటు హీరోయిన్‌ది చాలా స్ట్రాంగ్‌ క్యారెక్టర్‌ వుంటుంది. మన సమాజంలో ఆడవాళ్లకి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అవి మానసికంగా చాలా అల్లకల్లోలం చేస్తుంటాయి. ఆ పాయింట్‌ ఇంతవరకూ ఎవరూ టచ్‌ చేయలేదు. జనరల్‌గా టెన్త్‌, ఇంటర్మీడియెట్‌, డిగ్రీ చదివే అమ్మాయిలు బస్సుల్లో ప్రయాణించేటప్పుడు మగవాళ్ళు కావాలని కొంతమంది, అనుకోకుండా కొంతమంది అమ్మాయిల్ని టచ్‌ చేస్తారు. ఆ టైమ్‌లో అమ్మాయిలు చాలా ఎలర్జీకి గురవుతారు. ఆ టచ్‌ వాళ్లని చాలాకాలం వెంటాడుతుంది. ఇలాంటి కొన్ని సెన్సిటివ్‌ అంశాలని హీరోయిన్‌ డీల్‌ చేస్తుంది. పాటలకి, రొమాన్స్‌కే కాకుండా హీరోయిన్‌ క్యారెక్టర్‌కి ఓ పర్పస్‌ వుండాలని ట్రై చేస్తున్నాం. ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ వుంటూనే అండర్‌ కరెంట్‌లో కొంత మెస్సేజ్‌ వుంటుంది.

ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చెయ్యాలి…

‘వైశాఖం’ మేము ఎంత ఎక్స్‌పెక్ట్‌ చేశామో అంత కమర్షియల్‌గా సక్సెస్‌ అయ్యింది. మా పరిధి మేరకు ఆ చిత్రం మాకు చాలా హ్యాపీ. ఎక్కడికెళ్ళినా అప్రిషియేట్‌ చేస్తున్నారు. సిల్వర్‌ క్రౌన్‌ అవార్డు వచ్చింది. ‘లవ్‌లీ’ సినిమాకి కమర్షియల్‌గా సక్సెస్‌తో పాటు మంచి అప్రిషియేషన్స్‌ లభించాయి. ‘లక్కీఫెలో’ సినిమా ‘లవ్‌లీ’ కంటే చాలా పెద్ద హిట్‌ అవుతుంది. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అన్నీ ఈ చిత్రంలో వున్నాయి

మహిళా దర్శకుల సంఖ్య పెరగాలి..

ప్రస్తుతం ఎంతోమంది మహిళా జర్నలిస్ట్‌లు వున్నారు. అలాగే ఇండస్ట్రీలో కూడా మహిళా దర్శకులు ఇద్దరు, ముగ్గురే వున్నారు. ఇంకా ఎంతోమంది ఇన్‌స్పైర్‌ అయి మంచి సినిమాలు తీయాలి. మహిళా దర్శకుల సంఖ్య మరింత పెరగాలి. వారందరికీ నా స్వాగతం. వెబ్‌సిరీస్‌ చేసే ఆలోచన లేదు. నా ఫోకస్‌ అంతా సినిమాలమీదే. సినిమాకి వున్నంత క్రేజ్‌ వెబ్‌ సిరీస్‌కి వుండదు. ఇప్పటికీ మా ‘చంటిగాడు’, ‘లవ్‌లీ’, ‘వైశాఖం’ సినిమాల గురించి మాట్లాడుకుంటారు అంటే సినిమాకి వున్న పవర్‌ అలాంటిదన్నారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy