మహిళా సదస్సుకు వెళ్లకుండా రోజా నిర్బంధం

rojaఅమరావతిలో జరుగుతున్న మహిళా పార్లమెంట్ కు వెళ్లున్న వైసీపీ ఎమ్మెల్యే రోజాను.. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఆపేశారు పోలీసులు. దీంతో ఆమె ఆందోళనకు దిగారు. సమావేశానికి హాజరుకావాలని ఇన్విటేషన్ పంపి అడ్డుకోవడమేమిటని మండిపడ్డారు.  రమ్మని ఆహ్వానం పంపి వస్తే అవమానించారు.ఎయిర్ పోర్టులో గంటపాటు నిర్భంధించారని ఆరోపించారు.తర్వాత ఎయిర్ పోర్ట్ వెనక డోర్ నుంచి ఒంగోలు రోడ్ లో తీసుకెళ్లారని ఓ వీడియో రిలీజ్ చేశారు.

స్పీకర్ కోడెల శివప్రసాద్, సీఎం చంద్రబాబు ఇంతటి పిరికి వాళ్లని అనుకోలేదన్నారు రోజా. దమ్మున్న  వాళ్లయితే ఈ సదస్సుకు రిషేతేశ్వరి తల్లిదండ్రులు ,మేథాపాట్కర్,బృందాకారత్ వంటి వారిని ఆహ్వానించేవారన్నారు. కానీ  ఆహ్వానించకుండా కేవలం భజన పరులను రప్పించుకుని…అమరావతిని పొగిడించుకుని..ఈ విషయాన్నే నాలుగు కాలాల పాటు చెప్పుకుని తిరగాలనే అభిప్రాయంతో ఉన్నారు తప్ప..ఈ సదస్సు నిజంగా మహిళల ఉపయోగపడేటట్లు లేదని ఆరోపించారు రోజా. 13 కోట్ల రూపాయలు ఖర్చు చేసి స్పీకర్, సీఎం సొంత డబ్బా కొట్టించుకున్నారని మండిపడ్డారు .

గుంటూరు జిల్లా పేరేచర్ల జంక్షన్ లో ఆగిన వాహనం నుంచి రోజా దిగేందుకు ప్రయత్నించటంతో.. అడ్డుకున్నారు పోలీసులు. ఈ ప్రయత్నంలో కిందపడిపోయారు ఎమ్మెల్యే రోజా. బలవంతంగా వాహనంలోకి ఈడ్చుకెళ్లారు. ఖాకీల వైఖరితో కన్నీళ్లు పెట్టుకున్న రోజా.. పెద్దపెద్దగా కేకలు వేశారు. ఉమెన్ పార్లమెంట్ సదస్సుకు హాజరుకాకుండా ఒంగోలు తరలిస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy