మహేశ్ ని కలిసిన సిద్ధాపూర్ గ్రామస్థులు

maheshఅభిమానించే వ్యక్తిని దగ్గరగా చూడటమే పెద్ద సంతోషం… అదే వ్యక్తి తమతో చేతులు కలిపి… నవ్వుతూ.. నవ్విస్తూ మాట్లాడితే… ఇక ఆ ఆనందానికి అవధులే ఉండవు. ఇప్పుడు అలాంటి ఆనందంలోనే ఉన్నారు మహబూబ్ నగర్ జిల్లా సిద్ధాపూర్ గ్రామస్థులు. సూపర్ స్టార్ మహేశ్ బాబును కలిసిన ఆనందంలో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవలే ఈ గ్రామన్ని దత్తత తీసుకున్నాడు మహేశ్. శ్రీమంతుడు సినిమాలో తను ఏదైతే చేశాడో..  దాన్నే ఆచరణలో పెట్టడానికి కేటీఆర్ సలహాతో సిద్ధాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. దీంతో ఆ గ్రామస్థులు… రామోజీ ఫిల్మ్ సిటీలో ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ లో ఉన్న మహేశ్ ని కలిసి తమ సంతోషాన్ని పంచుకున్నారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy