మహేశ్ సినిమాలో అల్లరోడు

maheshఅల్లరి కుర్రోడు నరేశ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట మహేశ్. ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్టు టాలీవుడ్ టాక్. మురుగదాస్ సినిమా తరువాత కొరటాల శివ, వంశీ పైడిపల్లి డైరెక్షన్లలో సినిమాలలో నటించనున్నాడు ప్రిన్స్. ఈ సినిమాను అశ్వనిదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించనున్నారు. వంశీ డైరెక్షన్ లో చేస్తున్న ఈ సినిమాలో నరేశ్ కూడా ఉండనున్నాడట. ఇప్పటికే సీనియర్ హీరో వెంకటేష్ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించిన మహేష్… ఈ సారి అల్లరోడితో సందడి చేయనున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా ఎక్కువ భాగం అమెరికాలో షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy