మహేష్ షార్ట్ ఫిల్మ్

3మహేష్ బాబు షార్ట్ ఫిల్మ్ లో నటిస్తున్నాడు. సూపర్ స్టార్ ఏంటీ షార్ట్ ఫిల్మ్ ఏంటీ అనుకుంటున్నారా.. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీ మొత్తం కోడైకూస్తోంది. మహేష్ ఒక్కడే కాదు.. ఫ్యామిలీ మొత్తం ఈ షార్ట్ మూవీలో నటిస్తోంది. మహేష్, నమ్రత, గౌతమ్, సితార కూడా తమ వంతు పాత్రలు పోషించనున్నారంట. ఇది సరదా కోసం కాదంట. హీల్ ఏ చైల్డ్ ఫౌండేషన్ కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చారిటీ సంస్థలో బ్రాండ్ అంబాసిడర్ గా కూడా మహేష్ ఉన్నాడు. నిరుపేద పిల్లల ఆరోగ్యంపై ఈ సంస్థ పోరాడుతుంది. అనారోగ్యంతో ఉన్న పిల్లల వైద్య ఖర్చులు భరిస్తుంది. ఆపదలో ఆదుకుంటుంది. మహేష్ అండ్ ఫ్యామిలీ తీసే షార్ట్ ఫిల్మ్ వల్ల వచ్చే డబ్బును హీల్ ఏ చైల్డ్ ఫౌండరేషన్ కు ఇస్తారు. సామాజిక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ షార్ట్ ఫిల్మ్ కు ఎవరు డైరెక్షన్ చేస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఓ ప్రముఖ డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ప్రిన్స్  అడిగితే ఎవరు కాదంటారండీ.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy