మాకూ ఉంది బాధ్యత : రోడ్డెక్కిన పోలీస్ జాబ్ కనెక్ట్

telangana-policeవిద్యార్హతలు, నైపుణ్యం ఉండి ఉద్యోగాల్లేని యువతకు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు హైదరాబాద్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిరుద్యోగులైన యువతకు వారివారి ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగావ కాశాలు కల్పించడం కోసం ‘జాబ్‌ కనెక్ట్‌’ పేరుతో సంచార ఉద్యోగ సమాచార వాహనాన్ని రూపొందించారు. ఈ వాహనాన్ని రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ గురువారం (ఆగస్టు3) హైదరాబాద్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో ప్రారంభించారు.

ప్రస్తుతం నగరంలోని బస్తీలు, కాలనీల్లో నిరుద్యోగ, అర్హతలకు తగిన ఉద్యోగాలు లేని యువత ఎందరో ఉన్నారు. వీరంతా ఉద్యోగాల కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో తెలుసుకోవడం కూడా వీరికి కష్టంగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసులు ‘జాబ్‌ కనెక్ట్‌’వాహనాన్ని రూపొందించారు.

దీని నిర్వహణ కోసం నగర పోలీసు విభాగం టీఎంఐ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. వీరు సిటీలోని రిటైల్‌ రంగంతో పాటు చిన్న, మధ్యతరహా సంస్థల్లో ఉన్న ఖాళీల వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తారు. ఆయా ప్రాంతాల కు వెళ్లినప్పుడు అక్కడి యువత ఈ వాహనంలో ఉన్న సిబ్బందిని సంప్రదించడం ద్వారా ఖాళీల వివరాలు తెలుసుకోవచ్చు.

నిరుద్యోగులు తమ అర్హతలు, ఆసక్తుల్ని రిజిస్టర్‌ చేసుకోవచ్చు.ఇలా రిజిస్టర్‌ అయిన వారికి అనువైన ఉద్యోగం ఉన్నట్‌లైతే ‘జాబ్‌ కనెక్ట్‌’సిబ్బంది SMS ద్వారా సమాచారం ఇస్తారు. అవసరమైన వారికి ఇంటర్వ్యూ తదితరాల్లో శిక్షణ కూడా ఇస్తారు. అంతేకా కుండా… ‘జాబ్‌ కనెక్ట్‌’వ్యాన్‌కు అమర్చిన స్క్రీన్‌ ద్వారా ప్రజలకు అవసరమైన సూచనలు, సలహాలను పోలీసులు అందిస్తుంటారు.

పేర్లు నమోదు చేసుకోవాల్సిన వెబ్ సైట్: www.hyderabadcitypolice.gov.in/jobs.html

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy