మాటివ్వండి.. ఉచితంగా చదువుకోండి

img_0101ఐఐటీ ఖరగ్ పూర్ తన విద్యార్థులకు సరికొత్త వెసులుబాటు కల్పించింది.  జాబ్ సంపాదించిన తర్వాత కాలేజీకి డొనేషన్లు ఇస్తామని ఎవరైతే ముందుకు వస్తారో వారికి ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించింది. ‘నేర్చుకోండి-సంపాదించండి-తిరిగి ఇవ్వండి’ అనే ట్యాగ్ లైన్ తో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఐఐటీ ఖరగ్‌పూర్‌ ప్రారంభిస్తోంది. ఆర్థికంగా దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నవారికి, అర్హత పరీక్షలో తొలి వంద ర్యాంకుల్లో ఉండి ఈ విద్యాసంస్థలో చేరినవారికి పూర్తిగా ఫీజు మాఫీ ఉంటుంది. అయితే వారు తమ సంపాదనలో కొంత మొత్తాన్ని కాలేజీకి డొనేట్ చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి. అలాంటివారికి విద్యాబోధన విషయంలో పూర్తి బాధ్యత వహిస్తనంటోంది ఐఐటీ ఖరగ్ పూర్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy