మాట్లాడుతుండ‌గా మైక్ లాగేసుకున్న కేంద్ర మంత్రి

ministerరిటైర్డ్ ఉపాధ్యాయుడితో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రాజన్‌ గోహెన్‌ ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా అసోంలోని నాగోన్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాజ‌న్ హాజ‌ర‌య్యారు. ఈ స‌భ‌లో నాగోన్ కు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు త‌మ ప్రాంతంలోని స‌మ‌స్య‌ల గురించి  వివరించ‌డం మొద‌లు పెట్టాడు. ఇంత‌లో మంత్రి అతని దగ్గర నుంచి మైక్‌ లాక్కోవడం అక్కడున్న వారిని షాక్‌కు గురి చేసింది. ఆయనకు తిరిగి మైక్‌ ఇవ్వకపోగా సమస్యల గురించి ప్రజలముందు మాట్లాడవద్దని హెచ్చరించారు.

అంతేకాదు ఇలాంటి చిన్న విషయాలు అధికారులతో మాట్లాడాలి కానీ ఇక్కడ కాదన్నారు. ఇక్కడ ప్రజల్ని ఉత్తేజ పరిచే మాటలే మాట్లాడాలన్నారు. మీకేదయినా సమస్య వస్తే నన్ను వ్యక్తిగతంగా కలవండి… అంతేగాని ఇలా ప్రజలముందు మాట్లాడకండి అన్నారు.  దీంతో ప్రజలకు మా మీద చెడు అభిప్రాయం ఏర్పడుతుందన్నారు కేంద్ర మంత్రి రాజన్‌ గోహెన్‌.

అయితే మంత్రి ప్రవర్తించిన తీరుని నిరసిస్తూ ఆ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి సంఘాలు, కార్యకర్తలు, ఇతర ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగారు. ప్రజల తరఫున తమ సమస్యను చెప్పుకోడానికి వచ్చిన వ్యక్తిపై మంత్రి ఇలా ప్రవర్తించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy