మానవత్వం ఉందా : మనిషి తగలబడుతుంటే.. ఫొటోలు తీసుకున్నారు

humanరోడ్డుపై యాక్సిడెంట్ అయ్యింది.. పక్కన, వెనక ఉండేవారు వాహనాలు ఆపేసి పరిగెత్తుకుంటూ వెళ్తారు.. పడ్డవారికి ఏమైనా అయ్యిందా అని చూస్తారు.. అంబులెన్స్ కు కాల్ చేస్తారు.. పోలీసులకు ఇన్ఫామ్ చేస్తారు.. ఇవన్నీ చకచకా జరిగిపోతాయి. అతను ఎవరో.. ఏంటో కూడా అనవసరం.. ఎందుకంటే ప్రమాదంలో ఉన్నాడు కాబట్టి. కానీ అక్కడ మాత్రం అలా జరగలేదు. ఇందుకు భిన్నంగా సాగింది. ఓ మనిషి నేషనల్ హైవేపై(జాతీయ రహదారి) నిలువెల్లా తగలబడుతుంటే కనీసం ఒక్క వాహనం కూడా ఆగలేదు. అందరూ చూస్తూ పోయారు. చుట్టుపక్కల కొందరు మాత్రం వచ్చారు. వచ్చినోళ్లు చక్కగా ఫొటోలు, వీడియోలు తీశారు.

ఈ దారుణ ఘటన మహారాష్ట్ర రాష్ట్రంలోని బీడ్ జిల్లాలో జరిగింది. గురువారం (మే 11) బీడ్ జిల్లాలోని జాతీయ రహదారిపై రెండు బైక్స్ ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నాయి. కింద పడ్డారు. టూవీలర్స్ స్పీడ్ ఎక్కువగా ఉండటంతో కొంత దూరంగా ఈడ్చుకెళ్లాయి. వాహనాల్లోని పెట్రోల్ రోడ్డుపై పడింది. రోడ్డుపై రాపిడికి మంటలు చెలరేగాయి. అగ్గికి ఆజ్యం అన్నట్లు..  ఓ టూవీలర్ పై మద్య సీసాలు ఉన్నాయి. అవి పగిలిపోయి పెట్రోల్ మంటల్లో పడ్డాయి. అంతే ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మద్యం సీసాలతో ట్రావెల్ చేస్తున్న వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. మరో బైక్ పై వెళుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావటం.. కదల్లేని స్థితిలో ఉండటంతో మంటల్లో చిక్కుకున్నాడు. జాతీయ రహదారిపైనే వెళుతున్న కార్లు, బస్సులు, బైక్స్ అందరూ చూస్తూనే ఉన్నారు కానీ.. ఒక్కరూ కూడా ఆగలేదు. చుట్టుపక్కల వారు కొందరు వచ్చినా..  వాళ్లు ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తుననట్లుగా ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు.

ఫైర్ సిబ్బంది వచ్చిన తర్వాతే మంటలు అదుపులోకి వచ్చాయి. నంబర్ ప్లేట్ ఆధారంగా.. మంటల్లో చనిపోయిన వ్యక్తి వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు సీనియర్ పోలీస్ ఆఫీసర్ జి.శ్రీధర్. వేడుకగా నిలబడి చూస్తున్న జనాన్ని ఏమనాలి అంటూ వ్యాఖ్యానించారు. కనీసం మంటలను ఆర్పే ప్రయత్నం కూడా చేయకపోవటం అంటే.. మనుషుల్లో మానవత్వం ఏమైందని జాతీయ మీడియాతో మాట్లాడిన మాటల్లో తన ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy