
బీహార్ రాజధాని పాట్నాలో ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఐదు నెలల చిన్నారిని పాట్నా మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. పరీక్షించిన వైద్యులు.. వెంటనే ఆక్సిజన్ మాస్క్ అమర్చారు. వెంటనే కొన్ని పరీక్షలు చేయాలని చెప్పారు. అయితే అప్పటి వరకు ఆక్సిజన్ మాస్క్ తీయొద్దని చెప్పారు.
ఆస్పత్రి నుంచి పరీక్షలు చేయటానికి మరో ప్రాంతానికి వెళ్లాలి. దీని కోసం స్ట్రెక్చర్ ఇవ్వాలని ఆ పేరంట్స్ కోరారు. దీనికి నిరాకరించారు. ఆస్పత్రిలో లేవని చెప్పారు. వేడుకున్నా వినలేదు. లేదు పొమ్మంటూ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఆ తండ్రి.. తన బంధువుకి ఫోన్ చేసి ఆస్పత్రికి రప్పించుకున్నాడు. మాస్క్ ఉన్న చిన్నారిని తండ్రి ఎత్తుకుంటే.. వెనకే ఆ బంధువు ఆక్సిజన్ సిలిండర్ పట్టుకుని పరీక్షలు నిర్వహించే ప్రాంతానికి పరుగులు తీశారు. ఈ దృశ్యం చూసిన మిగతా పేషంట్లు, ఆస్పత్రికి వచ్చిన వారు సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపిల్లలపై ఇంత కర్కశంగా ప్రవర్తిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలు దేవుడితో సమానమని చెప్పే వారే.. చిన్న పిల్లలపై ఇలా ఎలా వ్యవహరిస్తారని నిలదీస్తున్నారు. చిన్నారిని అరచేతుల్లో పట్టుకుని నడుస్తున్న ఆ తండ్రి ఫోటో ఇప్పుడు అందరి హృదయాలను కలచివేస్తుంది.
#Patna: Man allegedly denied stretcher by Patna Medical College and Hospital, carries his child in arms with an oxygen cylinder. #Bihar pic.twitter.com/O6aJxsKgJR
— ANI (@ANI) March 23, 2018