
మానవ వనరుల వినియోగ సూచీలో భారత్ 103వ ర్యాంకులో ఉంది. ఐదు బ్రిక్ దేశాల్లో చివరన ఉంది భారత్. దక్షిణాసియాలోని 130 దేశాల్లో 103వ స్థానంలో నిలిచింది ఇండియా. శ్రీలంక, నేపాల్ కంటే కూడా భారత్ వెనుకంజలో ఉంది భారతదేశం.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విలువను సృష్టించుకోవడానికి ఉన్న పరిజ్ఞానం, నైపుణ్యం.. ఒక దేశ మానవ వనరుల వినియోగ సూచీకి కొలబద్దగా పరిగణిస్తారు. జెనీవా కేంద్రంగా పని చేసే ప్రపంచ ఆర్థిక సంస్థ (డబ్ల్యూఈఎఫ్) తాజాగా ఈ జాబితాను రూపొందించింది. గత ఏడాది 105వ ర్యాంకు సాధించిన భారత్ ఇప్పుడు రెండు స్థానాలు ఎగబాకింది. కానీ, బ్రిక్స్ దేశాలతో పోలిస్తే చాలా వెనుక ఉంది. రష్యా 16, చైనా 34, బ్రెజిల్ 77, దక్షిణాఫ్రికా 87వ స్థానంలో ఉన్నాయి. ఇక శ్రీలంక, నేపాల్ కంటే భారత్ వెనుబడినా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ కంటే ముందుంది.
అయితే, భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాల అభివృద్ధి విషయంలో మాత్రం 65వ స్థానంలో ఉండడం విశేషం. ఈ విషయంలో ‘ఆధునిక భారత్ ఆవిర్భవిస్తోంద‘ని, ‘భారత్ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నా సరైన దిశలోనే ముందుకెళుతోంద’ని డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. ఈ సూచీలో నార్వే అగ్రస్థానంలో ఉండగా.. అమెరికా 4వ స్థానంలో ఉంది. కాగా, ఆరోగ్యపరంగా ఐక్యరాజ్య సమితి 2030 నాటికి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునే విషయంలో భారత్కు 128వ ర్యాంకు దక్కింది. కాలుష్యం, పారిశుధ్యం, శిశు ఆరోగ్యం తదితర అంశాల ప్రాతిపదికగా ర్యాంకులను లెక్కకట్టారు.