మానసిక ఒత్తిడిలో 5 కోట్ల మంది యువత

depression-stress-mindభారతదేశంలోని యువతీ, యువకులలో అధికశాతం మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రపంచ యువ జనాభాలో ఎక్కువ శాతం భారత్ లోనే ఉంన్నారని తెలిపింది ప్రపంచ నివేదిక. యువత ఎక్కువగా మానసిక సమస్యలతో నిరాశ, నిస్పృహ, ఒత్తిడికి లోనై కుంగి కృషించి పోతున్నారంది.

ప్రపంచ జనాభాలో 32 కోట్ల మంది యంగస్టర్స్ మానసిక ఒత్తిడికి లోనవుతుండగా.. వాళ్లలో 5 కోట్ల మంది భారతీయులు ఉన్నారంటే.. యువత ఎంతలా ఆందోళనకు గురవుతున్నారో తెలుస్తోంది. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ-2015 నివేదికలో ఈ విషయాలను ప్రచురించింది WHO సంస్థ.

ఆత్మహత్యల్లో ఎక్కువ శాతం భారత వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే జరుగుతున్నాయని వెల్లడించింది. వీళ్లలో ఎక్కువ మంది ఆగ్నేయాసియా, పశ్చిమ పసిఫిక్‌ ప్రాంత దేశాలవారేనని తెలియజేసింది. ప్రపంచ యువకులలో చోటు చేసుకుంటున్న మానసి రుగ్మతలను 2005 నుంచి 2015 వరకు WHO అధ్యయనం చేయగా ఆసక్తికర సంఘటనలు బయటపడ్డాయి.

యువకుల్లో మానసి రుగ్మతలు 18.4 శాతం పెరిగాయని వెల్లడించింది. దేశ జనాభా (2015)లో 4.5 శాతం కుంగుబాటుకు లోనవగా… 3 శాతం మంది ఆందోళనకు గురయ్యారని వివరించింది.

శంలో ప్రతి పది మందిలో ఒకరు మానసిక సమస్యలతో చిధ్రమవుతున్నారంది వాల్డ్ నివేదిక. ఈ ఏడాది ఒత్తిడి వల్ల 7.8 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపింది. ఆత్మహత్య చేసుకున్నవాళ్లలో పురుషులతో పోల్చితే మహిళలే ఎక్కువగా ఉన్నారని తెలియజేసింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy