మానేరుకు మహర్దశ..టూరిస్టు హబ్ గా కరీంనగర్

kcr-mannerకరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న మానేరు డ్యామ్ అభివృద్ధి మీద సమీక్ష చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రగతిభవన్ లో, మానేరు రివర్ ఫ్రంటు అభివృద్ధి మీద సీఎం కు ప్రెజెంటేషన్ ఇచ్చింది టాటా బృందం. సీఎం తో పాటు ఆర్థిక మంత్రి ఈటల, ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ప్రెజేంటేషన్ చూశారు.

మానేర్ డ్యామ్ ను ఒక పర్యాటక కేంద్రంగా, కరీంనగర్ పట్టణాన్ని ఒక టూరిస్ట్ హబ్ గా చేసేందుకు ప్రాజెక్టు తయారు చేశామని టాటా గ్రూప్ ప్రతినిధులు చెప్పారు. ఈ ప్రాజెక్టుతో కరీంనగర్ లో సాంస్కృతిక, ఆహ్లాదకర కార్యక్రమాలు చేసుకోవచ్చని చెప్పారు. తెలంగాణ ఉద్యమం, చరిత్ర తెలిసేలా ప్రాజెక్టు ఉంటుందన్నారు.

ప్రెజెంటేషన్ ను చూసిన సీఎం, దేశంలోనే మొదటి రివర్ ఫ్రంటు గా గుర్తింపు తెచ్చుకున్న సబర్మతీ రివర్ ఫ్రంట్ ను అధ్యయనం చేయాలని చెప్పారు. హైదరాబాద్ పర్యాటక స్థలాలో కూడా లేని ఆకర్షణలు.. కరీంనగర్ లో ఉండాలన్నారు. హైదరాబాదీలు కూడా కరీంనగర్ కు వెళ్లాలన్న ఆసక్తి కలగేలా నిర్మాణాలు ఉండాల్నన్నారు.

అలాగే కరీంనగర్ అభివృద్ధికి సీఎం సూచనలు చేశారు. ఒక అందమైన సిటీగా కరీంనగర్ ను ఎలా చేయవచ్చో ఎంపీ, ఎమ్మెల్యే ఆలోచన చేయాలని చెప్పారు. ప్రభుత్వ ఖాళీ జాగాల్లో చెట్లను పెంచాలనీ, . శాతవాహన విశ్వవిద్యాలయం చుట్టూ కేబీఆర్ పార్క్ తరహాలో గ్రీన్ వాక్ వే పెట్టాలన్నారు. సిటీ డెవలప్ మెంట్ పై మరింతగ చర్చించేదుకు జిల్లా అధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసారు ముఖ్యమంత్రి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy