మాన్ సూన్ అలర్ట్ : ఈసారి సాధారణ వర్షాలే

monsoon-imdఈ ఏడాది వర్షాలు తక్కువగా పడతాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. దేశం మొత్తం మీద 96 శాతం వర్షపాతం మాత్రమే నమోదవుతుందంటున్నారు నిపుణులు. రానున్న వర్షాకాలంలో సాధారణ వర్షపాతమే ఉంటుందన్నారు.

సాధారణ వర్షపాతం 96-104 మధ్య నమోదవుతుండగా.. ఈ ఏడాది  ఈ ఆగస్టు- అక్టోబర్ మధ్య ఎల్-నినో ప్రభావం ఏర్పడుతుందని ప్రకటించింది ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్ మెంట్(IMD).

ఎల్-నినో వస్తే వర్షాలు తక్కువగా వస్తాయి. లా-నినో వస్తే వర్షాలు ఎక్కువగా పడతాయన్నారు నిపుణులు. గడచిన 50 ఏళ్లలో కురిసిన వర్షాలు లెక్కగట్టి.. ఎల్-లినో ఎఫెక్టా లేక లా-నినో పరిస్థితులు ఉంటాయో లెక్కగడతారు. ఈఏడాది మాములు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. లానినో రావాల్సి ఉండగా సాధారణ వర్షపాతమే పడుతుందంటున్నారు. సముద్రంలో ఏర్పడే ఉష్ణోగ్రతల ఆధారంగా ఎల్-నినో.. లా-నినో పరిస్థితులు ఏర్పడతాయంటున్నారు పరిశోధకులు.

వాతావరణ శాఖ చెప్పినదాని కంటే 5శాతం ఎక్కువ ఉండవచ్చు లేదా తక్కువగా పడొచ్చు అంటున్నారు నిపుణులు. దేశంలో నైరుతి రుతుపవనాల కారణంగా 86శాతం వర్షపాతం నమోదైనా.. ఎల్-నినో వస్తుందని ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్ మెంట్(IMD) ప్రకటించింది.

భారతదేశంలో 70 శాతం వర్షపాతం నమోదైనా.. నీటి పారుదల సౌకర్యం లేనందున వరి, పత్తి, చెరకు, పత్తి, సోయాబీన్ పంటలు పండించే రైతులు కష్టాలు ఎదుర్కోనే పరిస్థితి వస్తుందన్నారు. 2016లో తగిన వర్షపాతమే పడిందన్నారు ఐఎమ్ డీ శాస్త్రవేత్త డీఎస్ పాయ్. 107 శాతం వర్షపాతం వస్తుందని చెప్పగా కేవలం 97 శాతం వర్షపాతం నమోదైంది. ఎన్-లినో కారణంగా 2014-15 లో కరువు ఏర్పడిందన్నారు.

Leave a Reply

bathukamma song

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy