మాయమాటలు చెప్పి..బాలికతో హెడ్ మాస్టర్ పెళ్లి

GIRLవిద్యాబుద్ధులు నేర్పించాల్సిన స్కూల్ హెడ్ మాస్టరే స్టూడెంట్ జీవితాన్ని నాశనం చేశాడు. మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని తీసుకుని పారిపోయాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ గ్రామంలో వెలుగుచూసింది. వివరాల్లోకెళితే..ముచ్చింతల్‌ కు చెందిన ఓ బాలిక ఇటీవల వెల్లడించిన టెన్త్ ఫలితాల్లో ఫెయిల్ అయింది.

ఫెయిలైన సబ్జెక్ట్.. పాస్ చేయిస్తానని చెప్పి బాలికకు మాయమాటలు చెప్పి హెడ్ మాస్టర్ అక్బర్ ఆమెను తీసుకెళ్లిపోయాడు. ఆ తర్వాత బాలికను పెళ్లి చేసుకున్నాడని తెలుస్తోంది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy