మారుతికి.. భలేమంచి చౌక బేరం

bhale-ssభ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న డెరెక్టర్ మారుతి ప్ర‌స్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. నాగ చైత‌న్య హీరోగా శైలజా రెడ్డి అల్లుడు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రమ్య‌కృష్ణ ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఇదిలావుంటే మరోసినిమాను లైన్ లో పెట్టాడు మారుతి.  గురువారం (మార్చి-29) సాయంత్రం మారుతి త‌న టీమ్‌తో క‌లిసి కొత్త ప్ర‌య‌త్నం చేయ‌బోతున్న‌ట్టు ఓ పోస్ట‌ర్ ద్వారా తెలిపాడు. పోస్ట‌ర్ మొత్తం కరెన్సీ కనిపిస్తుండటం వలన, ఇది డబ్బుకు సంబంధించిన స్టోరీ కావొచ్చని అభిమానులు భావించారు. అయితే శుక్రవారం (మార్చి-30) ఈ మూవీకి భలే మంచి చౌక బేరం అనే టైటిల్ ఫిక్స్ చేసి, ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. మారుతి అండ్ టీం కాన్సెప్ట్‌తో రూపొంద‌నున్న ఈ సినిమాను ప్ర‌సాద్ అరోల్లా, గుడ్ సినిమా గ్రూప్ సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి. మార్చి 31న  ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు. న‌వీద్‌, పార్వ‌తీశం ముఖ్య పాత్ర‌లుగా భ‌లే మంచి చౌక బేరం రూపొందుతుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy