మారుతీరావు చూపించిన “దృశ్యం” రివర్స్… పరువు ఇప్పుడు పోయిందన్న ఎస్పీ

నల్గొండ జిల్లా: కూతురు అమృత భర్త ప్రణయ్ ను అత్యంత కిరాతకంగా చంపించిన మారుతీరావు మైండ్ సెట్ ను పోలీసులు వివరించారు. హత్య వెనుక కుట్ర…. మారుతీరావు క్రిమినల్ ఆలోచనలను పూసగుచ్చినట్టు వివరించారు ఎస్పీ రంగనాథ్. హత్యకు స్కెచ్ వేయడం.. సుపారీ కిల్లర్లతో ప్రణాళిక అమలు చేయడం..  ఆ హత్యలో తాను లేను అని జనాన్ని నమ్మించడం కోసం ఆయన ఆడిన నాటకాలను అన్నింటినీ ప్రెస్ మీట్ లో వివరంగా చెప్పారు పోలీసులు.

హత్య జరిగిన రోజు… మారుతీరావు సీన్ లో లేడు అని పోలీసులను, జనాన్ని, అధికారులను నమ్మించేందుకు ఓ సీన్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు. తెలుగులో వెంకటేశ్ నటించిన “దృశ్యం” సినిమాలోలాగా… ఓ సెటప్ రెడీ చేయాలనుకున్నాడు. ఐతే… మారుతీరావు వేసిన ప్లాన్స్ వర్కవుట్ కాలేదన్నారు పోలీసులు. అతడు చేసిన తప్పులే పోలీసులకు క్లూస్ అందించాయని.. దొరికిపోయాడని చెప్పారు.

ప్రణయ్ మర్డర్ కు ముందే స్కెచ్ వేసిన మారుతీరావు.. చంపేత సాహసం తాను చేయనని చెప్పేందుకు కొద్దిరోజుల ముందు అమృత , ప్రణయ్ లకు రిసెప్షన్ పార్టీ ఇచ్చారు. కిల్లర్లు చంపుతామని ప్లాన్ చేసినప్పుడల్లా హైదరాబాద్ కు, నల్గొండకు వెళ్లి హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో తిరిగివచ్చేవాడు. సెప్టెంబర్ 14న హత్య జరిగిన రోజు దొంగనాటకాలు ఆడాడని ఎస్పీ రంగనాథ్ చెప్పారు. తాను కావాలనే ఉదయం కలెక్టరేట్ కు వెళ్లి అధికారులతో మాట్లాడాడు. ఆ తర్వాత తాను కారులో వెళ్తుండగా మధ్యలో డీఎస్పీ, ఆర్డీవోలతో కొద్దిసేపు నవ్వుతూ పలకరించాడు. వినాయక నిమజ్జనం ఏర్పాట్ల గురించి మాట్లాడాడు. అలా.. చాలామందిని కలిసి పలకరించాడు. ఐతే… చివర్లో ఆయన తడబాటుతో పోలీసులకు దొరికిపోయాడని.. నేరం ఎన్నడూ దాగదని ఎస్పీ చెప్పారు.

కూతురు అమృత ఎక్కడుంది.. ఎలా ఉంది అనే సమాచారాన్ని భార్య చెబుతుంటే… ఆ మాటలను ఎప్పటికప్పుడు కిల్లర్స్ కు చెబుతుండేవాడు మారుతీరావు. సెప్టెంబర్ 13న అమృత.. తల్లికి ఫోన్ చేసి రేపు హాస్పిటల్ కు వెళ్తున్నాం అని చెప్పడమే పాపమైపోయింది. ఆ విషయం కిల్లర్లతో చెప్పిన మారుతీరావు.. మర్నాడు మర్డర్ జరిగిపోవాలని చెప్పాడు. అదేరోజు.. శర్మ .. ప్రణయ్ ను నరికిచంపి పారిపోయాడు.

అలా… పక్కా ప్రణాలికతో ప్రణయ్ ను చేయించాడని పోలీసులు చెప్పారు. పరువు కోసం , కుల అహంకారంతో మారుతీరావు ఈ దారుణానికి ఒడిగట్టాడన్న ఎస్పీ రంగనాథ్… మారుతీరావు పరువు ఇప్పుడు పోయిందని అన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy