మారుతీ కంపెనీ షాక్ : స్విఫ్ట్, బాలెనో కార్ల రీకాల్

maruదేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ.. భారత్ లో తన కొత్త బాలెనో, స్విఫ్ట్ కార్లకు రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 52 వేల 686 యూనిట్లు ఎఫెక్ట్ అయ్యాయని కంపెనీ తెలిపింది. 2017 డిసెంబర్‌ 1 నుంచి 2018 మార్చి 16 మధ్యలో తయారు చేసిన స్విఫ్ట్‌, బాలెనో కార్లను పరీక్షించిన తర్వాత లోపాన్ని గుర్తించింది. ఈ రెండు బ్రాండ కార్లలో బ్రేక్‌ వాక్యుమ్‌ హోస్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది.

బ్రేక్ వాక్యుమ్ హోస్ రీప్లేస్‌ చేయడం కోసం భారత్ లో ఓ సర్వీస్ క్యాంపెయిన్ చేపడుతున్నట్లు మంగళవారం (మే-8) కంపెనీ తెలిపింది. ఈ క్యాంపెయిన్‌ లో భాగంగా మే 14, 2018 నుంచి వెహికల్ ఓనర్లు.. డీలర్లను సంప్రదించి ప్రాబ్లమ్ ఉన్న భాగాన్ని రీప్లేస్‌ చేసుకోవాలని కంపెనీ సూచించింది. సర్వీసు క్యాంపెయిన్‌లో భాగంగా ఈ తనిఖీ, రీప్లేస్‌మెంట్‌ కస్టమర్లకు పూర్తిగా ఉచితమని మారుతీ సుజుకీ తెలిపింది. పూర్తి వివరాల కోసం కస్టమర్లు మారుతీ సుజుకీ అధికారిక వెబ్ సైబ్ లేదా షోరూంని సంప్రదించటం ద్వారా కస్టమర్లు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy