
పాత మహబూబ్నగర్ జిల్లాలో భాగమైన వనపర్తి అందుకు అని విధాలా అనుకూలమేనని క్లారిటీ ఇచ్చింది. ఇందు కోసం రూ.700 కోట్లు ఖర్చు అవుతుందని, 250 ఎకరాల భూమి కావాలని నిర్ణయించింది. ఉత్తర తెలంగాణలోని బాసరలో గ్రామీణ ట్రిపుల్ ఐటీగా పిలిచే RGUKT ఉందని…దక్షిణ తెలంగాణలో లేదని…రాష్ట్ర విభజన ఖ్రమంలో తెలంగాణలో ఒక్కటే ఉన్నందున మరో విద్యాసంస్థను వనపర్తిలో నెలకొల్పాలని ఆ ప్రాంతం నుంచి డిమాండ్ వచ్చింది. దాని ఏర్పాటును బలంగా కోరుతోంది రాష్ట్ర ప్రణాళికా సంఘం.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ బాసర ట్రాపుల్ ఐటీ లాంటి విద్యాసంస్థను నెలకొల్పేందుకు ఉన్న అనుకూలతలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలిని కోరింది. JNTUH కళాశాల ప్రిన్సిపాల్, ఓయూ ప్రిన్సిపాల్.. ఉన్నత విద్యామండలితో ఏర్పాటైన కమిటీ ఇటీవలే నివేదిక సమర్పించింది. దీన్ని ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నారు. ట్రిపుల్ ఐటీ తరహా విద్యాసంస్థ ఏర్పాటుతో పాటు వనపర్తిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలగా మార్చే అవకాశాన్నీ కమిటీ పరిశీలించింది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయనుంది.