మార్కులపై జలసీ: తోటి విద్యార్థినిపై విషప్రయోగం

poisonతన కంటే ఎక్కువ మార్కులు వచ్చాయనే అసూయతో తోటి విద్యార్థిని చంపాలని చూసింది మరో విద్యార్ధిని. తాగే వాటర్ బాటిల్ లో దోమలను చంపే లిక్విడ్ ను కలిపింది. దీంతో ఆ వాటర్ తాగిన  విద్యార్ధిని అస్వస్థతకు గురైంది.పరిస్థితి మిషమించడంతో స్కూల్ యాజమాన్యం పేరెంట్స్ కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.

14 ఏళ్ల వయస్సు ఇద్దరు విద్యార్థినిలు ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నారు. ఒకే బెంచీలో పక్కపక్కనే కూర్చునే ఈ ఇద్దరిలో మార్కులు చిచ్చుపెట్టాయి. పరీక్షలో తన కంటే ఎక్కువ మార్కులు రావడంతో సోమవారం (ఆగస్టు21) ఓ విద్యార్థిని మరో విద్యార్ధి వాటర్ బాటిల్ లో దోమలను చంపే లిక్విడ్ కలిపింది. ఆ వాటర్ తాగిన మరో విద్యార్ధిని తీవ్ర అస్వస్థతకు గురైంది.  వెంటనే ఆస్పత్రికి తరలించగా…చికిత్స చేపట్టిన డాక్టర్లు కలుషిత వాటర్ కారణమే దీనికి కారణమని చెప్పారు. దీంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టారు పోలీసులు. తోటి విద్యార్ధిని పైనే అనుమానం వ్యక్తం చేసింది బాధితురాలు. దీంతో క్లాస్ రూంలోని సీసీ ఫుటేజ్ ని పరిశీలించగా..అసలు విషయం బయట పడింది. అయితే విషయం పోలీసులకు తెలిసిపోవడంతో భయపడిన ఆ విద్యార్థిని… ఇంట్లోనే దోమల మందు కలిపిన వాటర్ ను తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మంగళ వారం (ఆగస్టు 22)  జరిగింది. వెంటనే ఆ బాధితురాని కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy