మార్కెట్లోకి ఐఫోన్ 6S – ఆస్ట్రేలియాలో ఎగబడ్డ జనం

2CBE3E3D00000578-3248660-image-m-61_1443168837966షాపుల ముందు క్యూ.. రాత్రంతా జాగారం.. రోడ్లపై పడక.. వర్షం పడుతున్నా గొడుగులతో ప్రత్యక్షం అయ్యారు. ఇక షాపు ఓపెన్ చేయగానే పదండి ముందుగా అంటూ తోసుకువెళ్లారు. వచ్చే వారం రోజులు.. తిండి దొరకదన్న ఆరాటం కాదు.. బంద్ అని కాదు. లేటెస్ట్ గా వచ్చిన యాపిల్ ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ సెల్ ఫోన్ కోసం. వాల్డ్ లో ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో రిలీజ్ చేసింది కంపెనీ. ఫోన్ ను ఫస్ట్ తీసుకోవాలన్న ఆతృతతో సిడ్నీలోని యాపిల్ షోరూమ్స్ ఎదుట క్యూకట్టారు జనం. రాత్రంతా షాపుల ఎదుట వెయిట్ చేశారు. వర్షం పడుతుంటే గొడుగుల బయటకు తీశారేగానీ.. మాల్స్ నుంచి కదల్లేదు. ఇక షాప్స్ ఓపెన్ చేయగానే ఎగబడ్డారు. ఫోన్ సొంతం చేసుకున్న ఆనందంలో సెల్పీలు తీసుకున్నారు. ఇక ఇండియాలో కొత్త వెర్షన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇంతకూ ఈ ఫస్ట్ పీస్ ఎవరు కొన్నారో తెలుసా… సిడ్నీలోని ఓ రోబో. దాని పేరు లూసీ. దాని ఓనర్.. మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ గా పని చేస్తున్న లూసీ కెల్లికి గాడ్జెట్స్ అంటే చాలా ఇష్టం. తాను ఆఫీస్ వర్క్స్ తో బిజీగా ఉండటంతో రోబోను లైన్లో పెట్టి … తన పనుల్లో తాను మునిగిపోయింది. దీంతో యాపిల్ 6S ఫస్ట్ పీస్ రోబో లూసీకి దక్కింది.

2CBDFDFF00000578-3248660-Stores_in_London_were_the_next_to_open_their_doors_Covent_Garden-a-23_14431670051742CB9D42E00000578-3248660-About_50_people_were_spotted_lining_up_outside_Sydney_s_Apple_st-a-19_14431670050752CB99A7600000578-3248660-Kuah_Lin_Li_of_Thailand_slept_under_an_umbrella_overnight_ahead_-a-14_14431670049552CB5B2E300000578-3248660-image-a-93_14431716855312CBE742B00000578-3248660-image-a-65_1443169560751

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy