మార్కెట్లోకి లెనోవో ఎస్5 ప్రొ

లెనోవో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎస్5 ప్రొ ను చైనా మార్కెట్‌లో ఇటీవలే విడుదల చేసింది. త్వరలో భారత్‌ లోనూ ఈ ఫోన్ విడుదల కానుండగా మంగళవారం (అక్టోబర్-23) నుంచి ఈ ఫోన్‌ కు చైనాలో విక్రయాలను ప్రారంభించనున్నారు. భారత్‌ లో ఈ ఫోన్‌ కు  చెందిన 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.13,755 ధరకు లభ్యం కానుంది. ఈ ఫోన్‌లో 6.18 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 20, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలను ఇందులో ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 20, 8 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు ఉండగా, వీటికి ఇన్‌ఫ్రారెడ్ ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని కల్పించారు. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు.

లెనోవో ఎస్5 ప్రొ ఫీచర్లు
6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 20, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy