మార్కెట్లోకి సామ్ సంగ్ ‘గెలాక్సీ నోట్ 8’

samsung-note-8-1.jpg NSటాప్ టెలికం కంపెనీ సామ్ సంగ్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ నోట్ 8’ ను గ‌త కొద్ది రోజుల కింద‌ట ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.  ప్ర‌స్తుతం ఈ ఫోన్ మంగళవారం ( సెప్టెంబర్-12) భార‌త మార్కెట్‌లో విడుద‌లైంది. రూ.67,900 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఈ నెల 21వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది. మిడ్‌నైట్ బ్లాక్‌, మాపిల్ గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.

గెలాక్సీ నోట్ 8 ఫీచ‌ర్లు

* 6.3 అంగుళాల డిస్‌ప్లే
* ఆండ్రాయిడ్‌ నోగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌
* డ్యుయల్‌ సిమ్‌ సదుపాయం
* 6జీబీ ర్యామ్‌
* 64జీబీ ఇంటర్నల్‌ మెమొరీ
* 12 మెగాపిక్సెల్‌తో రెండు బ్యాక్ కెమెరాలు
* 8 మెగాపిక్సెల్‌తో ఫ్రంట్ కెమెరా
* 3,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం
* వైర్‌లెస్‌ ఛార్జింగ్‌

 

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy