మార్కెట్ చెత్తతో కరెంట్ ఉత్పత్తి.. త్వరలో బయో ఎనర్జీ ప్లాంట్

  • మార్కెటింగ్‌ శాఖ శ్రీకారం
  • పైలెట్‌ ప్రాజెక్టు గా బోయిన్‌ పల్లి మార్కె ట్‌ ఎంపిక
  • త్వరలో బయోఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటు
  • రోజూ 10 టన్నుల చెత్తతో విద్యుదుత్పత్తి

హైదరాబాద్, వెలుగు: సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగానికి మార్కెటింగ్‌ శాఖ శ్రీకారం చుడుతోంది. మార్కెట్లలో పోగయ్యే వ్యర్థా ల నుంచి విద్యుత్‌ ను తయారు చేసేందుకు శాఖ సిద్ధమవుతోంది. పైలెట్‌ ప్రాజెక్టుగా బోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మార్కె ట్‌ లో బయోఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

రోజుకు 15 టన్ను లు

హైదరాబాద్‌ లో మార్కెట్లలో రోజుకు దాదాపు 15 టన్నుల వరకు వ్యర్థా లు మిగిలిపోతుంటాయి. బోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, గడ్డిఅన్నారం మార్కె ట్ల నుంచి 10 టన్నులు, ఎల్బీనగర్‌ , గుడిమల్కా పూర్‌ మార్కె ట్ల నుంచి 5 టన్నుల వ్యర్థాలు పోగవుతున్నాయి. వీటిని జీహెచ్‌ఎంసీ వాహనాల ద్వారా జవహర్‌ నగర్‌ డంపింగ్‌ యార్డు కు తరలిస్తున్నారు. ఇలా తరలించే బదులుగా విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించింది. రోజుకు 10 టన్నుల చెత్తతో విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా తొలుత బోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మార్కె ట్‌ లో బయో ఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది. ప్లాంట్‌ నిర్మాణానికి రూ.2 కోట్లు, సివిల్‌ వర్క్స్‌ రూ.35 లక్షల నుంచి 40 లక్షలు వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. కేంద్రం నుంచి రూ.2 కోట్ల వరకు అందనుండగా, మిగతా 40 లక్షలు మాత్రం మార్కెటిం గ్‌ శాఖ భరిస్తుంది.

బోయిన్‌ పల్లిలో రూ.30 లక్షలు ఆదా

ఒక్క బోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మార్కె ట్‌ కే రోజూ 800 యూనిట్లకు పైగా విద్యుత్‌ వినియోగం జరుగుతుంది. ఇలా ఏడాదికి దాదాపు రూ.30 లక్షల వరకు విద్యుత్‌ బిల్లులు వస్తున్నాయి. పది టన్నుల సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ ఏర్పాటు చేయడం ద్వారా ఏటా రూ.30 లక్షలకు పైగా విద్యుత్‌ బిల్లులు ఆదా కావడంతోపాటు పర్యావరణానికి మంచి జరిగేలా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. బోయినపల్లిలో నిర్మించే ప్లాంట్‌ నిర్మాణం సక్సెస్‌ అయితే.. దీన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు విస్తరించాలని మార్కెటింగ్‌ శాఖ ఆలోచిస్తోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy